దేవరకద్ర: నియోజకవర్గ కేంద్రంలో జూలై 2న కోర్టు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమ వారం కోర్టు భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ దేవరకద్ర నియోజకవర్గకేంద్రంగా ఉన్నా గత పాలకులు చేసిన నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. ఈ కోర్టు ద్వారా దేవరకద్ర, కౌకుంట్ల, చిన్నచింతకుంట, అడ్డాకుల, మూసాపేట మండలాలకు సంబంధించిన అన్ని రకాల కేసులు ఇక్కడే పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చాక దేవరకద్రను మున్సిపాలిటీగా మార్చామని, ఇప్పటికే రూ.30 కోట్ల నిధులు తెచ్చి వివిధ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే కోయిల్‌సాగర్ పర్యాటక కేంద్రం ఏర్పాటు కోసం రూ.9.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయన్నారు. రూ.33 కోట్లతో వంద పడకల ఆస్పత్రి పనులు జరుగుతున్నాయని. రూ.10 కోట్లతో స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.


