నాకు మా గ్రామంలో సర్వే నం.141లో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకం నాకు రావడం లేదు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేదు. మీరైనా స్పందించి పీఎం కిసాన్ నిధి ఇప్పించి న్యాయం చేయండి.
– గోవిందు, పార్‌పల్లి, కోయిల్‌కొండ మండలం
ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేయాలి..
జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్య పెరి గిపోతుంది. ఉన్న రోడ్లు సరిపోవడం లేదు. గతంలో ట్రాఫిక్ సిగ్నళ్లు ఉండేవి. ప్రస్తుతం లేకపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికి ట్రాఫిక్ నియంత్రణలోకి రావడం లేదు. వెంటనే ట్రాఫిక్ సిగ్నళ్లను ఏర్పాటు చేయాలి. – ఆనంద్‌కుమార్,
శ్రీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు


