ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

Jun 29 2026 1:23 AM | Updated on Jun 29 2026 1:23 AM

వెల్దండ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌, టాస్క్‌ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చౌదర్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవైన ఉపాధ్యాయులు, డిజిటల్‌ విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల దుస్తులు, మధ్యాహ్న భోజనం తదితర వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. చౌదర్‌పల్లి పాఠశాలలో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ముగ్గురు వలంటీర్ల నియమించి, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ రాజీవ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement