పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి పరిధిలో ప్రతి ఆదివారం జరిగే మైస మ్మ జాతరలో ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడడంతో దేహశుద్ధి చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ప్ర త్యక్ష సాక్షులు, ఆలయ కమిటీ సభ్యుల కథనం ప్రకారం.. మైసమ్మ జాతరలో ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడి సెల్‌ఫోన్లు, చిన్నపిల్లల కాళ్ల కడియాలు, కొంత నగదును అపహరించడంతో గమనించిన భక్తులు వారిని పట్టుకొని దేహశుద్ధి చేసి ఆలయ కమిటీకి అప్పగించారు. మొక్కులు తీర్చుకునేందుకు మైసమ్మ దగ్గరికి వచ్చిన మహిళలు చిన్నారులును ఎత్తుకొని వెళ్తుండగా.. వెనుక నుంచి పిల్లల కాళ్లకు ఉన్న వెండి కడియాలు, గొలుసులు, సెల్‌ఫోన్లు కొట్టివేయడం ఆ మహిళలకు వెన్నతోపెట్టిన విద్యగా మారింది. మైసమ్మ జాతర వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంటుండంతో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.


