మిడ్జిల్: మండల కేంద్రంలోని జడ్చర్ల– కల్వకుర్తి ప్రధాన రహదారిపై లారీని బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో తమ్ముడు మృతి చెందగా అన్న తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు మిడ్జిల్ మండలంలోని మసిగొండ్లపల్లికి చెందిన అన్న, తమ్ముడు శ్రీను, రాజేందర్(36) ఇద్దరు కలిసి బైక్‌పై మిడ్జిల్‌కు వచ్చి తిరిగి వెళ్తుండగా స్థానిక హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం 108లో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాజేందర్ మృతి చెందగా శ్రీను తీవ్రగాయాలతో బయటపడ్డాడు. మృతుడు రాజేందర్‌కు ముగ్గురు భార్యలు, ఆరు మంది పిల్లలు ఉండగా వారు అతడిని వదలేసి వెళ్లడంతో తల్లి మణేమ్మ వద్ద ఉంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రమాదంపై ఎస్‌ఐ శ్రీనువాసులును వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
చెరువులో పడి
యువకుడి మృతి
నవాబుపేట: బంధువుల ఇంట్లో జరిగిన పూజ కు సంబంధించిన పూజా ద్రవ్యాలు చెరువులో కలిపేందుకు వెళ్లిన యువకుడు ప్రమాదవశా త్తు నీటిలో మునిగి మృతిచెందిన ఘటన మండలంలోని తీగలపల్లిలో చోటుచేసుకుంది. తీగలపల్లికి చెందిన మంగళి రాంప్రసాద్(26) ఆదివారం బంధువుల ఇంట్లో మూడు రోజుల క్రి తం జరిగిన వ్రతానికి చెందిన ద్రవ్యాలను ఆది వారం బంధవులతో కలిసి చెరువు నీటిలో కలిపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో ము నిగిపోయాడు. బంధువులు గ్రామస్తులకు సమాచారం అందించగా.. చెరువు నీటిలో వెతకగా.. తూమ్ చెంత శవమై తేలాడు. మృతుడి తండ్రి మంగలి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేందర్ తెలిపారు.
రోడ్డుప్రమాదంలో
మహిళ దుర్మరణం
వనపర్తి రూరల్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా.. ఇద్దరికి గాయాలైన ఘటన వనపర్తిలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణ ఏఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన చిలుమూర్తి రమేష్, భార్య చిట్టెమ్మ, కొడుకు వంశీ కలసి ఆదివారం ఉదయం బైక్‌పై పెద్దకొత్తపల్లి మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా.., వనపర్తి పట్టణంలోని ఓల్డ్ యూకో బ్యాంకు వద్ద ఆదివారం మధ్యాహ్నం డీసీఎం అతివేగంగా వచ్చి ముందు వెళ్తున్న బైకును ఢీ కొట్టడంతో చిట్టెమ్మ (51)కింద పడిపోగా.. ఆమైపె డీసీఎం వెళ్లింది. దీంతో చిట్టెమ్మను వెంటనే స్థానికులు మాణిక్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందిందని ధ్రువీకరించారు. మరో ఇద్దరు చిలుమూర్తి రమేష్, కుమారుడు వంశికి గాయాలు కాగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు వంశి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
రైలుకిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
మానవపాడు: పోతులపాడు–అలంపూర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ అశోక్‌కుమారు కథనం ప్రకా రం.. కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపుగా ఆదివారం తెల్లవారుజామున కి.మీ. 232.6.7. మధ్య రైలు పట్టాలపై సుమారు 30–35ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వద్ద లభించిన బైక్ కీ ఆధారంగా అతడు ప్రకా శం జిల్లా గిద్దలూరు చెందిన వ్యక్తిగా భావిస్తు న్నారు. ఎరుపు రంగు ఆఫ్ హ్యాండ్స్ టీ–షర్ట్సు, నీలం రంగు లోయర్ లేత గ్రీన్ కలరు డ్రాయర్ ధరించి ఉన్నాడు. ఛాతి కింద కుడివైపు నల్లని పుట్టుమచ్చ ఉంది. మృతదేహాన్ని గద్వాల ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
బల్మూర్: తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన మండలంలోని పోలీశెట్టిపల్లి శివారులో శివసాయినగర్‌లో వెలుగు చూసింది. ఎస్‌ఐ రాజేందర్ తెలిపిన వివరాలు.. శివసాయినగర్‌లో నివాసం ఉంటున్న సాజిదాబేగ్, భర్త ఖాజలు ఈ నెల 25న మొహర్రం పండుగ సందర్భంగా కొండనాగుల గ్రామానికి వెళ్లారు. పండుగ అనంతరం ఆదివారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో 2 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.15 వేల నగదు, 10 విలువైన చీరలు అపహరించినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. దొంగిలించబడిన వస్తువుల విలువ సుమారు రూ.6 లక్షల వరకు ఉంటుందని బాధితులు వా పోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


