ఏరువాక సాగారో.. అన్నో రైతన్నా | - | Sakshi
Sakshi News home page

ఏరువాక సాగారో.. అన్నో రైతన్నా

Jun 29 2026 1:23 AM | Updated on Jun 29 2026 1:23 AM

ఏరువాక పౌర్ణమి.. రైతు సంస్కృతికి జీవనాడి

నారాయణపేట: మండే ఎండలతో పగుళ్లు పడిన నేల.. ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతన్న.. తొల కరి జల్లుల కోసం ఎదురుచూస్తున్న పొలాలు.. ఈ దృశ్యాల మధ్య జూన్‌ 29న జరుపుకునే ఏరువాక పౌర్ణమి రైతుజీవితంలో మరో కొత్త వ్యవసాయ సంవత్సరానికి నాంది పలుకుతోంది. భూమాతకు నమస్కరించి, ఎద్దులను అలంకరించి, నాగలికి పూజలు చేసి తొలి దుక్కితో సాగును ప్రారంభించే ఈ పండుగలో రైతు విశ్వాసం, ప్రకృతి పట్ల కృతజ్ఞత, జీవన తత్వం అంతర్లీనంగా కనిపిస్తాయి. ఏరువాక సాగారో...‘ అనే జానపద గీతం వినిపించగానే రైతు గుండెల్లో కొత్త ఉత్సాహం చిగురిస్తుంది. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా జరుపుకునే ఏరువాక పౌర్ణమి కేవలం ఓ పండుగ కాదు.. వానకాలం వ్యవసాయానికి శ్రీకారం, ప్రకృతికి కృతజ్ఞత, భూమాతకు వందనం, సమృద్ధి పంటల కోసం రైతన్న చేసే మహా ప్రార్థన.వ్యవసాయా న్ని జీవనాధారంగా భావించే తెలుగు రాష్ట్రాల్లో ఏరువాక పౌర్ణమికి విశేష ప్రాధాన్యం ఉంది. వర్షాకాలం ప్రారంభానికి సంకేతంగా భావించే ఈ రోజున రైతులు ఎద్దులు, నాగలి, వ్యవసాయ పనిముట్లకు పూజలు చేసి పొలంలో తొలి దుక్కితో కొత్త వ్యవసాయ సంవత్సరానికి నాంది పలుకుతారు. ఈ ఏడాది జూన్‌ 29 సోమ వారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యా ప్తంగా గ్రామాల్లో సంప్రదాయ వేడుకలు జరగనున్నాయి. ఏరువాక పౌర్ణమి సందర్భంగా భూ మాతను, వర్షాధిపతి ఇంద్రుడిని ప్రార్థిస్తూ సమృద్ధి గా వర్షాలు కురవాలని రైతులు కోరుకుంటారు.

వాతావరణ మార్పుల సవాల్‌

ఒకప్పుడు ఏరువాక సమయానికి వర్షాలు కచ్చితంగా పడతాయనే నమ్మకం ఉండేది. ఇప్పుడు వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షాలు ఆలస్యమవడం, ఒకేసారి భారీ వర్షాలు కురవడం, మధ్య లో దీర్ఘ విరామాలు రావడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే వ్యవసాయ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వర్షాల అంచనాలను గమనిస్తూ సాగు చేయాలని, తక్కువ కా లంలో పండే రకాలను ఎంచుకోవాలని, నీటి సంరక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

ఏరువాక అంటే..

‘ఏరు’ అంటే నాగలి. ‘వాక’ అంటే ప్రారంభం. నాగలితో భూమిని దున్నే వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే రోజే ఏరువాక. వానకాలం సీజన్‌కు ముందుగా రైతులు భూమిని సిద్ధం చేసుకునే ఈ సమయం వ్యవసాయ చక్రంలో కీలకమైన దశ. పురాణాల ప్రకారం భూమిని దేవతగా భావించి, పంటల ద్వారా జీవనాధారం కల్పిస్తున్న ప్రకృతికి కృతజ్ఞత చెప్పే ఉద్దేశంతో ఈ సంప్రదాయం ప్రారంభమైందని చెబుతారు.

ఎద్దుల మెడలో గంటలు..

ప్రత్యేక అలంకరణలు

భూమాతకు నమస్కారం..

కొత్త సాగుకు శ్రీకారం

ఏరువాక తర్వాతే అసలు

వ్యవసాయ సందడి

నేడు ఏరువాక పౌర్ణమి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement