జడ్చర్ల: జడ్చర్ల సెట్విన్ సాంకేతిక శిక్షణ సంస్థలో పలు కోర్సులకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సెట్విన్ కో ఆర్డినేటర్ విజయ్‌కుమార్ తెలిపారు. కోర్సులకు ఎంపికై న వారికి జూలై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నా రు. 3నెలలపాటు శిక్షణ కొనసాగుతుందని, తదు ప రి పరీక్ష నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. బ్యూటీషియన్, అడ్వా న్స్ బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్స్ తయారీ, కంప్యూటర్ కోర్సు, డీటీపీ, స్పోకెన్ ఇంగ్లీష్, కోర్సులకు 10వ తరగతి, జర్దోసి, మగ్గంవర్క్, ఎలక్ట్రీషియన్, హౌసింగ్ వైరింగ్‌కు 7వ తరగతి విద్యార్హత కలిగినవారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు ఆధార్, 2 పాస్‌ఫొటోలతో దరఖాస్తులు చేయాలన్నారు. వివరాలకు 94415 65895ను సంప్రదించాలని పేర్కొన్నారు.
బ్యాడ్మింటన్‌లో
క్రీడాకారులకు రెండోస్థానం
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లోని మణి కొండలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ (అండర్–19) బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఎన్‌జే జోయెల్, సంతోష్‌కుమార్ డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచారు. జిల్లా క్రీడాకారులు రెండోస్థానంలో నిలవడంపై మహబూబ్‌నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు.


