మసిగొండ్లపల్లిలో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

మసిగొండ్లపల్లిలో ఉద్రిక్తత

Jun 29 2026 1:23 AM | Updated on Jun 29 2026 1:23 AM

మిడ్జిల్‌: మండలంలోని మసిగొండ్లపల్లిలో మొహర్రంలో ప్రారంభమైన గొడవ చివరకు ఉద్రికత్తకు దారి తీసింది. ఆదివారం ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఆరుగురికి గాయాలైనట్లు తెలిసింది. ఘటనా స్థలానికి ఎస్‌ఐ శ్రీనువాసులు తమ సిబ్బందితో వెళ్లడంతో ఇరువర్గాల వారు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. గ్రామంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు పరిస్థితిని సమీక్షించారు. విచారణ అనంతరం దాదాపు ఇరువర్గాలకు చెందిన 36మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. గ్రామంలో ఇరువర్గాల ఘర్షణతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం గ్రామంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement