స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆర్యవైశ్య మహాసభ కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మినారాయణ అన్నారు. జిల్లాకేంద్రానికి సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం పాలమూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా గుద్దేటి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కలకొండ రాఘవేంద్రగుప్త, కోశాధికారిగా వలకొండ చంద్రశేఖర్, కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఆర్యవైశ్య మహాసభను మరింత బలోపేతం చేయాలని కోరారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణ పురోభివృద్ధికి అందరూ భాగస్వామ్యులు కావాలన్నారు. పట్టణ అభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజల సహకారంతోనే సాద్యమవుతుందన్నారు. ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి గణేష్‌గుప్త, రాజకీయ కమిటీ చైర్మన్ ఆగీరు వెంకటేశ్, రామకృష్ణ, సోమిశెట్టి సాయికిషోర్, జిల్లా అధ్యక్షుడు పాలాది రాంమోహన్, దేవాలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ ఇమ్మడి వెంకటరమణ, మేడిశెట్టి రవికుమార్, గుబ్బ ఆంజనేయులు, భీంశెట్టి హన్మంతయ్య, విట్యాల రామేశ్వర్, బెజుగం రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.


