మొదటి రోజు 99 శాతం పూర్తి | - | Sakshi
Sakshi News home page

మొదటి రోజు 99 శాతం పూర్తి

Jun 29 2026 1:11 AM | Updated on Jun 29 2026 1:11 AM

జిల్లాలో 1,05,564 మంది

చిన్నారులకు పోలియో చుక్కలు

పాలమూరు: వైద్యారోగ్యశాఖ పరిధిలోని జిల్లా ఇమ్యూనైజేషన్‌ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లావ్యాప్తంగా 0–5 ఏళ్ల బాలబాలికలకు పల్స్‌ పోలియో చుక్కల మందు విజయవంతంగా పంపిణీ చేశారు. ఒక్క రోజే 99 శాతంతో మొత్తం 1,05,564 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశారు. మిగిలిపోయిన చిన్నారులకు సోమ, మంగళవారం ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేస్తారు. మహబూబ్‌నగర్‌ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేయర్‌ మమత హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాసులు సైతం చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ పిల్లల ఉజ్వలమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్‌ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కలు వేయించాలన్నారు. రెండు చుక్కలు జీవం పిల్లల జీవితానికి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. అందరూ సకాలంలో చుక్కల మందు వేయడం వల్ల దేశాన్ని పోలియో రహిత భారతంగా మార్చడంలో భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ నటరాజ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శశికాంత్‌, డీఐఓ డాక్టర్‌ శైలజ, డాక్టర్‌ పులివిద్య, కమిషనర్‌ రామానుజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement