ఉత్సాహంగా ఫుట్‌బాల్‌ జట్టు ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఫుట్‌బాల్‌ జట్టు ఎంపికలు

Jun 29 2026 1:11 AM | Updated on Jun 29 2026 1:11 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి సబ్‌ జూనియర్‌ ఫుట్‌బాల్‌ బాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్‌ మాట్లాడుతూ జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిజామాబాద్‌ జిల్లాలో రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ బాలికల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ఉంటుందని తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికలకు వివిధ ప్రాంతాల నుంచి 50 మంది క్రీడాకారిణులు హాజరుకాగా 25 మందిని ప్రాబబుల్స్‌కు ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరికి రెండు రోజులపాటు క్యాంప్‌ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ సభ్యులు కేఎస్‌ నాగేశ్వర్‌, నందకిషోర్‌, కోచ్‌లు రాములు, నరేష్‌, రాజ్‌కుమార్‌, ప్రేమ్‌, ప్రకాశ్‌ పాల్గొన్నారు.

పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని ిసీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి పరమేశ్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి ఎన్ని నిధులు అవసరమో, తక్షణం కేటాయించి పూర్తిచేసి ఈ రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని కోరారు. కేసీఆర్‌ హయాంలో తుమ్మిళ్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, కానీ దానికి రిజర్వాయర్‌, కాల్వల నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేస్తే అల్లంపూర్‌ రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు. కేఎల్‌ఐ, భీమా ఫేస్‌ 1, 2, నెట్టెంపాడ్‌, కోయిల్‌సాగర్‌, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులకు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటక ప్రాంతం, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు కృష్ణాడెల్టాలో వాళ్ల నీటివాటా కంటే అధికంగా నీళ్లను తరలించకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరంటినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement