పులుల ఖిల్లా.. నల్లమల | - | Sakshi
Sakshi News home page

పులుల ఖిల్లా.. నల్లమల

Jun 28 2026 7:12 AM | Updated on Jun 28 2026 7:12 AM

టీఆర్‌ పరిధిలో గత నవంబర్‌ నుంచి జూన్‌ వరకు చేపట్టిన సర్వేకు 10 రేంజ్‌లను నాలుగు బ్లాక్‌లుగా విభజించారు. ప్రతి బ్లాక్‌లో 30 రోజుల పాటు కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 1,120 ప్రాంతాల్లో 2,240 కెమెరాల ట్రాప్‌తో 8 నెలల పాటు సర్వే నిర్వహించారు. ఇందుకోసం రిజర్వ్‌ను 2 చ.కి.మీ. గ్రిడ్‌లుగా విభజించారు. పులుల కాళ్ల ముద్రలు, మల విసర్జన, స్క్రాప్‌, రేక్‌ మార్కులు వంటి ప్రత్యక్ష ఆధారాలను నమోదు చేశారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ జీవశాస్త్ర నిపుణులు, హైటికోస్‌ సాంకేతిక, పరిశోధనా బృందం సహకారంతో ఈ కెమెరా ట్రాప్‌ సర్వే జాతీయ పులుల అంచనాలో కీలక భాగంగా నిలిచింది. పులుల సంఖ్య, వాటి వ్యాప్తి, ఆహార జంతువుల సమృద్ధి, నివాస ప్రాంతాల పరిస్థితులపై శాసీ్త్రయ సమాచారాన్ని సేకరించింది.

ల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్‌ అధికారులు కెమెరాలను అమర్చి నిఘా పెంచారు. ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో లేని చోట రేడియో ఫ్రీక్వెన్సీతో 360 డిగ్రీల పరిధిలో 24 గంటల పాటు సర్వే లెన్స్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రేడియో ఫ్రీక్వేన్సీ నెట్‌వర్క్‌ నుంచి ఇంటర్‌నెట్‌కు దృశ్యాలను అందుబాటులోకి వచ్చే వెసులుబాటు ఉండటంతో పర్యవేక్షణ మరింత పెరిగింది. అదే విధంగా వాకీటాకీలు పనిచేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశారు. 10 రేంజ్‌లు, 30 బేస్‌ క్యాంపుల పరిధిలో ఒక డ్రోన్‌, 350 కెమెరా ట్రాప్‌లతో పులుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు.

గణన ఇలా..

కెమెరాలతో నిఘా..

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో 42కు చేరిన పెద్ద పులులు

2024–25తో పోల్చితే ఆరు అధికం

గణనీయంగా పెరిగిన ఆడ పులుల సంతతి

సత్ఫలితాన్నిస్తున్న అటవీశాఖ చర్యలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement