సంపూర్ణ ఆరోగ్యానికి రెండు చుక్కలు | - | Sakshi
Sakshi News home page

సంపూర్ణ ఆరోగ్యానికి రెండు చుక్కలు

Jun 28 2026 7:12 AM | Updated on Jun 28 2026 7:12 AM

జిల్లాలో నేడు పల్స్‌ పోలియో కార్యక్రమం

ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య, ఆరోగ్య శాఖ

జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 1,06,208 మంది

పాలమూరు: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహిస్తున్న పల్స్‌పోలియో కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలియో వ్యాక్సిన్‌లను పీహెచ్‌సీలకు, ఉప కేంద్రాలకు చేర్చారు. జిల్లాలో 2,824 మంది వ్యాక్సినేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఆదివారం 676 కేంద్రాల ద్వారా పోలియో చుక్క లు వేయడంతో పాటు ఈ నెల 29,30 తేదీలలో 2,01,448 గృహాలను సందర్శించి చుక్కల మందు వేయనున్నారు.

● జిల్లాలో చిన్నారులకు చుక్కల మందు పంపిణీ చేయడానికి సంబంధిత శాఖ అధికారులు ఉన్న 16 మండలాలో ఉన్న 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 190 సబ్‌సెంటర్స్‌, 2 కమ్యూనిటీ హెల్త్‌సెంటర్స్‌, ఏరియా సెంటర్స్‌, అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌, 441 గ్రామాల్లో కలిపి మొత్తం 676 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాకు ఇప్పటికే 6,744 పోలియో వ్యాక్సిన్‌ వాయిల్స్‌ వచ్చాయి. జిల్లాలో 68 రూట్లు విభజించి 68 మంది పర్యవేక్షకులను నియమించారు. 24 మొబైల్‌ బృందాలు, 2,824 మంది వ్యాక్సినేటర్లు, 225 మంది ఏఎన్‌ఎంలు, 853 ఆశలు, 1,133 అంగన్‌వాడీలు, 613 మంది వలంటీర్లు ఈ పోలియో చుక్కల పంపిణీలో పాల్గొనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 0–5 వయసు కలిగిన 1,06,208 మంది చిన్నారులు ఉన్నారు. వారందరికీ చుక్కల మందు వేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు ఆయా పల్స్‌ పోలియే కేంద్రాలు వ్యాక్సిన్‌ వాయిల్స్‌ పంపిస్తారు. ప్రతి సెంటర్‌లో ఉదయం 7 గంటల నుంచి చుక్కల మందు వేసే కార్యక్రమం ప్రారంభం కానుంది.

● జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ ప్రతి చిన్నారికి చుక్కల మందు వేయాలని సంకల్పంతో జిల్లాలోని ప్రతి బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లలో కూడా చుక్కల మందు పాయింట్స్‌ ఏర్పాటు చేశారు. అలాగే జిల్లాలో 30 మొబైల్‌ టీంలు కూడా ఏర్పాటు చేశారు.

● పల్స్‌ పోలియో కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాకేంద్రంతో పా టు దేరవకద్ర, జడ్చర్ల, నవాబ్‌పేటలో స్టాక్‌ పాయింట్స్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో చుక్క ల మందు వ్యాక్సిన్‌ నిల్వ ఉంచుకొని అవసరమైన ప్రాంతాలకు పంపిస్తారు. ఈనెల 29న వైద్యా ఆరోగ్య సిబ్బందితో పాటు అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చుక్కలమందు వేయించుకోని పిల్లలు మందు వేస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement