భూత్పూర్: అంబేడ్కర్ ఆశయా లు, రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్లు కల్పించి, భూ సంస్కరణలు, పోడుభూముల పట్టాలను పంపిణీ చేసిన ఘనత దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకే దక్కుతుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జటోత్ రాంచందర్‌నాయక్ పేర్కొన్నారు. శనివారం భూత్పూర్ మున్సిపాలిటీలోని రాందాస్ తండాలో రిజర్వేషన్ స్వర్ణోత్సవం సందర్భంగా నిర్వహించిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సుయాత్ర భూత్పూర్‌కు చేరుకుంది. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బాలకోటి స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడారు. రిజర్వేషన్లు కల్పించడంతో నేడు ఉన్నతస్థాయిలో ఉద్యోగాలు, రాజకీయంగా ఎదిగారంటే ఇందిరమ్మ ఆశీర్వాదంతోనేనని పేర్కొన్నారు. తండాల్లో ప్రతి ఇంట్లో సంత్‌సేవాలాల్ ఫొటోతోపాటు ఇందిరమ్మ ఫొటోను పెట్టుకోవాలని గిరిజనులకు సూచించారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరమ్మ ఆశయ సాధనకు కృషిచేయాలని, సీఎం రేవంత్‌రెడ్డి ఆదే దిశగా ఆరు గ్యారెంటీలతో ముందుకు సాగుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ పూర్తిగా చేసిన ఘనత మాజీ సీఎం రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం గిరిజనులకు చేపట్టిన పథకాలు, ఇందిరా గాంధీ కల్పించిన రిజర్వేషన్లు, గిరిజనులకు స్థితిగతులపై అధ్యయనం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశంతో బస్సుయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతకుముందు గిరిజన మహిళలు నృత్యం చేస్తుండగా.. బస్సుయాత్రలో వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళలతో నృత్యం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్, శాసనమండలి కోచైర్మన్ కేతావత్ శంకర్‌నాయక్, మాజీ మంత్రి రవీంద్రనాయక్, ఎమ్మెల్యేలు నేనావత్ బాలునాయక్, భుక్య మురళీ నాయక్, రాందాస్‌నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, కాంగ్రె్‌స్ పట్టణ అధ్యక్షుడు నవీన్‌గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రాంచందర్‌నాయక్
భూత్పూర్‌కు చేరుకున్న ఇందిరమ్మ ఆశీర్వాద బస్సుయాత్ర


