కడసారి చూపునకు నోచుకోక.. | - | Sakshi
Sakshi News home page

కడసారి చూపునకు నోచుకోక..

Jun 28 2026 7:12 AM | Updated on Jun 28 2026 7:12 AM

గట్టు: కట్టుకున్న భర్త.. కన్నకొడుకు కళ్లెదుటే రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. తీవ్రంగా గాయపడి, కడచూపునకు నోచుకోలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది రాయపురం గ్రామానికి చెందిన లక్ష్మి. వివరాలిలా.. రాయపురం గ్రామానికి చెందిన హనుమంతు(42), అతని కొడుకు తిరుమలేష్‌(18)ను ఎర్రవల్లి–కర్నూలు జాతీయ రహదారిపై పుటాన్‌దొడ్డి స్టేజీ వద్ద గురువారం రాత్రి వాహనం ఢీకొని మృతిచెందారు. వీరి అంత్యక్రియలను శుక్రవారం రాయపురంలో నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన భర్త, కుమారుడు ఆఖరిచూపునకు నోచుకోలేక, ఆస్పత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతుంది రాయపురం లక్ష్మి. హనుమంతుకు తనకున్న ఎకరా పొలాన్ని సాగు చేసుకోలేక ఇటిక్యాల మండలం ధర్మారం గ్రామానికి చెందిన పొలం యజమాని వద్ద జీతానికి కుదిరాడు. హనుమంతుకు భార్య లక్ష్మితోపాటు ఇద్దరు కుమారురులు శరణప్ప, తిరుమలేష్‌తో కొంతకాలంగా ధర్మారంలోనే ఉంటున్నారు.

ఊరదేవర కోసం..

ధర్మారంలో ఉన్న హనుమంతు కుటుంబ సభ్యులు ఈనెల 23న గట్టుకు వచ్చారు. దేవర పండును ముంగించుకుని శరణప్ప ధర్మారం చేసుకోగా.. మిగతావారు గురువారం ధర్మారానికి తిరుగు ప్రయాణమయ్యారు. మరో 5కిలోమీటర్లు ప్రయాణిస్తే గమ్యం చేరుకుంటారనుకునేలోగా రోడ్డుప్రమాదంలో తండ్రీకొడుకులను మృత్యువు కబళించింది. లక్ష్మిని మాత్రం తీవ్రగాయాలతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పెబ్బేరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

విషాదం నింపిన రోడ్డు ప్రమాదం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement