రైతు బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

రైతు బలవన్మరణం

Jun 28 2026 7:12 AM | Updated on Jun 28 2026 7:12 AM

మిడ్జిల్‌: మండలంలోని కొత్తపల్లిలో రైతు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు రెడ్యానాయక్‌(60) లింబ్యాతండా సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద శనివారం ఉదయం వెళ్లాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది చెట్టుకు ఉరేసుకోగా.. చుట్టుపక్కలవారు గమనించిన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి మృతిచెందాడు. మృతుడి కుమారుడు మల్లేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోసుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. మృతుడికి భార్య సాలమ్మ ఉన్నట్లు తెలిపారు.

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

బల్మూర్‌: అతివేగంగా అజాగ్రత్తగా బైక్‌పై వచ్చి మరో ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందగా.. ముగ్గురికి గాయాలైన ఘటన మండలంలోని అనంతవరం–బల్మూర్‌ ప్రధాన రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజేందర్‌ కథనం ప్రకారం.. అనంతవరం గ్రామానికి చెందిన మిట్టకడుపుల శ్రీనివాసులు(50), తన స్నేహితుడు అర్కపల్లి వెంకటయ్యతో కలసి ఎక్సెల్‌పై బల్మూర్‌ వైపు వెళ్తుండగా.. లింగాల మండలం అంబటిపల్లికి చెందిన అతినారపు వెంకటయ్య తన బైక్‌పై అచ్చంపేట నుంచి అజాగ్రత్తగా వేగంగా వచ్చి ఎక్సెల్‌ను ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన శ్రీనివాసులును 108అంబులెన్స్‌లో అచ్చంపేట ఆప్పత్రికి తరలించగా.. చిక్తిత్స పొందుతూ మృతుచెందాడు. అతనితోపాటు ఉన్న మిత్రుడు వెంకటయ్య, అతినారపు వెంకటయ్య, కాకం తిరుపతయ్యకు గాయలుకావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై మృతుడి భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement