అలంపూర్ రూరల్: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన భైరంపల్లి గ్రామంలో శనివారం వెలుగు చూసింది. ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. భైరంపల్లికి చెందిన బోయ శ్రీరాములు (38) పీర్ల పండుగ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని గుండంలో నడవాలనుకుని స్నానం చేసేందుకు స్థానిక బావి దగ్గరికి వెళ్లాడు. తీరా ఎంతసేపటికి రాకపోవడంతో భార్య చుట్టుపక్కల వెతికింది. ఈ క్రమంలో శనివారం ఉదయం బావిలో శ్రీరాములు మృతదేహం కనబడింది. దీంతో భార్య రాధిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉంది.
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి
బల్మూర్: చెరువు అలుగు నీటిగుంటలో అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు శవమై తేలిన ఘటన మండలంలోని జిన్‌కుంట గ్రామ శివారులోని తుమ్మెన్‌పేటకు రహదారి బ్రిడ్జి కింది శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ముందలింటి ఈదమ్మ(60) శుక్రవారం రాత్రి నుంచి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో శనివారం గ్రామ సమీపంలోని ఊర చెరువు అలుగు వాగు గుంతలో చేపల వేటకు వెళ్లిన వారికి బ్రిడ్జి కింద ఉన్న గుంతలో ఆమె శవం కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతం మృతదేహాన్ని బయటకు తీశారు. వృద్ధురాలి మృతిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ రాజేందర్ తెలిపారు.


