రాజాపూర్: ఆధునిక, సాంకేతిక శిక్షణతో యువత భవిష్యత్‌కు రంగారెడ్డిగూడ గ్రామంలో నిర్మించబోతున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) బలమైన పునాది అవుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట్‌స్వామి అన్నారు. గురువారం రాజాపూర్ మండల రంగారెడ్డిగూడలో రూ.42 కోట్ల నిధులతో ఏటీసీ సెంటర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ యువతకు విద్యా, ఉద్యోగవకాశాలను అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పరని. అందులో భాగంగా తొలివిడతలో రూ.2 వేల కోట్లతో 55 ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్న ట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల పాలుజేసి అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీ.. నేడు ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేస్తలేరని చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. రాష్ట్ర ప్ర భుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి, నిధులు కేటాయిస్తోందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి రూ.12 వేల కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. అర్హులైన పేదలకు కొత్త రేషన్‌కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా 50 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి.. వారి కళ్లలో ఆనందాన్ని నింపుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం బాలానగర్ మండలంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ తీసుకొచ్చానని, అలాగే నవోదయ, జడ్చర్లలో ట్రిపుల్ ఐటీ కళాశాలను కూడా తీసుకొచ్చినట్లు చెప్పారు. రాజాపూర్‌లో రూ.8 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు, రూ.34 కోట్లు టాటా కన్సల్టెన్సీ ద్వారా సీఎస్‌ఆర్ నిధులతో ఏటీసీని నిర్మించబోతున్నట్లు పేర్కొన్నారు. కలెక్ట ర్ ఖుష్బూగుప్తా మాట్లాడుతూ ఏటీసీ సెంటర్ ఏర్పాటు చుట్టుపక్కల గ్రామాల యువతకు గొ ప్పవరమని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల ని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ జానకి, ట్రె యినీ కలెక్టర్ సాయిశివాని, మార్కెట్ చైర్‌పర్సన్లు అశ్విని, జ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ సుదర్శన్‌గౌడ్, సర్పంచ్ రేవతి తదితరులు పాల్గొన్నారు.
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట్‌స్వామి
రంగారెడ్డిగూడలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కు శంకుస్థాపన


