సిబ్బందే సహకరిస్తున్నారా..
పాఠశాలలు ఇతర పనుల నిమిత్తం అవసరం ఉన్న వారు వస్తుంటారు. కానీ ఆర్జేడీ పేరు చెప్పి ఎవరు రాలేదు. ఇటీవల ఏ పాఠశాలకు సంబంధించిన ఫైల్స్ చేయలేదు. పై అధికారి పలు పనుల నిమిత్తం ఆదేశాలు ఇస్తే వాటిని పాటిస్తాం. బయటి వ్యక్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నాం.
– విజయకుమారి, డీఈఓ
ఆర్జేడీ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో అడ్డగోలుగా ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటు చేయడంతో వాటికి అనుమతులు ఇప్పించేందుకు జోరుగా పైరవీలు సాగుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు అనుమతు ల విషయంలో బయటి వ్యక్తుల ప్రమేయం, పలువురు ఏజెంట్లు సంఘాల నాయకులు తరచూ డీఈ ఓ కార్యాలయంలో ఉంటూ పనుల కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు కొంత కాలంగా విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఆర్జేడీ పేరు చెప్పి డీఈఓ కార్యాలయంలో పలువురు ప్రైవేటు పాఠశాలల అనుమతులు, రెన్యువల్ చేయించడం వంటి పనులు చేయడాన్ని పలువురు విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
ఆర్డేడీ దిష్టిబొమ్మ దహనం..
డీఈఓ కార్యాలయంలో మహబూబ్‌నగర్ ఆర్జేడీ సోమిరెడ్డి ఏజెంట్ల ద్వారా పనిచేయించుకుంటున్నారని ఏఐఎస్‌ఎఫ్, డీవైఎఫ్‌ఐతో పాటు పలు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆర్జేడీ సోమిరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ప్రశాంత్, రాము మాట్లాడుతూ.. కొంత మంది ప్రైవేటు ఏ జెంట్ల ద్వారా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చేందుకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అనుమతుల్లేని పాఠశాలల జాబితా తయారు చేసి సంబంధిత ఏజెంట్లు పాఠశాలల దగ్గరకు వెళ్లి పాఠశాలలకు అనుమతులు ఇప్పస్తామని, రూ.లక్షల్లో డబ్బులు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. వీటికి కారణమైన ఆర్జేడీ సోమిరెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. సీఎం సొంత జిల్లాలో అవినీతి జరుగుతుంటే పట్టించుకోవడం లేదని, పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ, పుస్తకాలు విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదని తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బస్వరాజ్, దస్తప్ప, జీశాంత్, భానుప్రసాద్ పాల్గొన్నారు.
ఫిర్యాదుదారులే ఏజెంట్ల?
గత డీఈఓపై పలువురు ఆర్జేడీ, కలెక్టర్ కార్యాలయం, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయంలో అదే పనిగా ఫిర్యాదులు చేశారు. ఇందుకు ప్రధాన కారణం తమకు అనుకూలంగా వ్యవహరించలేదని, తామూ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన ఫైల్స్ ఇతర పనులు నిమిత్తం డీఈఓ దగ్గరకు వెళ్తే పనులు చేయలేదని కారణంతో గత డీఈఓపై అనేక మార్లు ఫిర్యాదులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సోమిరెడ్డి ఆర్జేడీగా బాధ్యతలు తీసుకున్న తర్వాతనే గత డీఈఓపై ఫిర్యాదులు పెరిగాయని, ఫిర్యాదుల నేపథ్యంలో ఆయనపై పలుమార్లు ప్రస్తుత ఆర్జేడీ ఎంక్వయిరీ చేయడం ఆరోపణలకు బలన్ని చేకూరుస్తున్నాయి.
● ఎవరి సలహాతో వారు గత డీఈఓపై ఫిర్యాదులు చేశారని, డీఈఓ మీద ఫిర్యాదులు చేసిన వారే ఇప్పుడు ఆర్జేడీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్న విద్యాశాఖలో తీవ్ర చర్చకు తావిచ్చింది. దీంతో ఒత్తిడి తట్టుకోలేక గత డీఈఓ వ్యక్తిగత సెలువులపై వెళ్లి అనంతరం ఇక్కడి నుంచి బదిలీ అయ్యారని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.
● పలు సెక్షన్లలో సిబ్బంది, ఇతర అధికారులు పనులు చేయకపోతే ఏదో ఒక ఆరోపణలతో ఫిర్యా దులు చేస్తున్నారని తెలుస్తుంది. గత డీఈఓపై కూడా రాష్ట్రస్థాయి అధికారులతో ఒత్తిడి చేయించి పలు పాఠశాలలకు అనుమతులు ఇప్పించడంలో ఏజెంట్లు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.
డీఈఓ కార్యాలయంలో
జోరుగా పైరవీలు
ప్రైవేటు పాఠశాలలకు
అనుమతుల్లో జోరు
ఆర్జేడీ స్వయంగా ఏజెంట్లను నియమించి అనుమతుల ఫైల్స్ చేయిస్తున్నట్లు
సంఘాల ఆరోపణ
అంబేడ్కర్ చౌరస్తాలో ఆర్జేడీ సోమిరెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన నాయకులు
గత డీఈఓపై ఫిర్యాదులు చేసిన వారే ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారా అన్న ప్రశ్న
వాస్తవానికి ప్రైవేటు పాఠశాలల అనుమతి ప్రక్రియ ఆన్‌లైన్‌లో కొనసాగుతుండగా పలు అనుమతులు సంతకాల ఇతర ఎన్‌ఓసీల తంతును స్వయంగా పాఠశాల యాజమాన్యాలు, సంబంధిత అధికారులు పరిశీలించాల్సి ఉంది. కానీ ఏ సంబంధం లేని వ్యక్తులు ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇప్పటించేందుకు డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల విషయంలో ఎంఈఓ, డీఈఓ కార్యాలయంలో సిబ్బంది సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.


