బైక్‌లు ఢీ.. ఇద్దరి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

బైక్‌లు ఢీ.. ఇద్దరి దుర్మరణం

Jun 26 2026 7:33 AM | Updated on Jun 26 2026 7:33 AM

తెలకపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెంది న ఘటన తెలకపల్లి మండలం గౌరెడ్డిపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఏ ఎస్‌ఐ బాలశంకర్‌రెడ్డి వివ రాల మేరకు.. మండలంలోని కమ్మరెడ్డిపల్లికి ఆవుల శాంతయ్య కొంతకాలంగా తెలకపల్లిలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నా రు. బుధవారం రాత్రి అతడి కుమారుడు ఆవుల భీముడు (17), తెలకపల్లికి చెందిన తన స్నేహితుడు తుపాకుల బాలుతో కలిసి బైక్‌పై గౌరెడ్డిపల్లిలో పీర్ల సవారీ చూసేందుకు వెళ్లాడు. వేడుకల అనంతరం అక్కడి నుంచి తెలకపల్లికి బయలుదేరారు. మరోవైపు కమ్మరెడ్డిపల్లికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి వట్టెపు జగన్‌కుమార్‌ (23) బైక్‌పై గౌరెడ్డిపల్లి వెళ్తుండగా.. పాత బస్టాండ్‌ సమీపంలో వారి వాహనా లు ఎదురెదురుగా ఢీకొన్నా యి. ప్రమాదంలో భీము డుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. జగన్‌కుమార్‌ తలకు తీవ్రగాయా లు కావడంతో చికిత్స నిమి త్తం హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడు హైదరాబాద్‌ ఆర్టీసీ డిపోలో ఉద్యోగం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అదే విధంగా తీవ్రగాయలైన బాలును హైదరాబాద్‌ ఆస్ప త్రికి తరలించారు. ఆవుల భీముడు తండ్రి శాంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

మరొకరికి తీవ్రగాయాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement