నవాబుపేట: ప్రభుత్వ బడికి తమ పిల్లను పంపిస్తే వారి ఇంటి పన్నును పూర్తిగా తానే భరిస్తానని సర్పంచ్ రవీందర్ ప్రకటించారు. బుధవారంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ప్రభుత్వ బడికి మరింత చేయూతనిచ్చి బడిని అభివృద్ధి చేద్దామని ఆయన వివరించారు. అందుకు ప్రైవేట్ పాఠశాలకు గ్రామంలో 55మంది పిల్లలు వెళ్తున్నారని.. వారి తలిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ బడికి పిల్లలను పంపిస్తే వారికి చెందిన ఇంటి పన్నులు 5ఏళ్లపాటు తానే భరిస్తానని ప్రకటించారు. దీంతో సర్పంచ్ ప్రకటించిన పన్నుల చెల్లింపు పథకంపై గ్రామంలో విశేషస్పందన వచ్చి వెంటనే 16మంది విద్యార్థులు ప్రైవేట్‌ను వీడి ప్రభుత్వ బడిలో చేరారు. అలాగే మిగతా కూడా రెండు రోజుల్లో ప్రభుత్వ పడిలో చేరుతారని వివరించారు. కాగా మన ఊరు–మన బడి కార్యక్రమాల్లో రుద్రారం సర్పంచ్ తీసుకున్న పన్నుల పథకం జిల్లాలోనే సంచలనంగా మారింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ నాగ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.


