భూమి డబ్బులు వచ్చాయి.. | - | Sakshi
Sakshi News home page

భూమి డబ్బులు వచ్చాయి..

Jun 25 2026 1:36 AM | Updated on Jun 25 2026 1:36 AM

భూమి డబ్బులు వచ్చాయి.. పనుల్లో వేగం పెంచుతాం..

గణపసముద్రం రిజర్వాయర్‌ నిర్మాణంలో నా భూమి 2.03 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. పరిహారం చెల్లిస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారు. ఇటీవల రూ.26 లక్షలు బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. సంతోషంగా ఉంది. మాకు పరిహారం డబ్బులు త్వరగా అందడంతో మిగతా రైతులు కూడా భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.

– బైని కొండయ్య, రైతు, ఖిల్లాఘనపురం

గణప సముద్రం రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు మొదట పరిహారం సకాలంలో అందకపోవడంతో తరుచూ పనులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఒకసారి 18 ఎకరాలకు, ఇటీవల 388 ఎకరాలకు రూ.44 కోట్లు విడుదల చేసింది. మొత్తం 647 ఎకరాలకుగాను ఇప్పటి వరకు 406 ఎకరాలకు పరిహారం అందింది. మిగతా రైతులు కూడా భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నా రు. ఆయా భూముల సర్వే కొనసాగుతోంది. ఇక నుంచి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.

– నరేందర్‌రెడ్డి, డీఈ, నీటిపారుదలశాఖ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement