మెయిన్ స్టేడియంలో క బడ్డీ అకాడమీ ఏర్పా టు కానుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు కబడ్డీ అకా డమీలో బాలుర ప్రవేశాల కోసం త్వరలో రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయి. ఎంపికల్లో ప్రతిభ కనబరిచి మెరిట్ సాధించిన క్రీడాకారులకు అకాడమీలో ప్రవేశాలు కల్పిస్తాం.
– రాజశేఖర్‌రెడ్డి, డీవైఎస్‌ఓ
సంతోషంగా ఉంది..
ఎన్నో ఏళ్ల నుంచి మహబూబ్‌నగర్ కబడ్డీ అకాడమీ ఏర్పాటు కావాలన్న కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. కబడ్డీ అకాడమీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి ఎంతో కృషి చేశారు. ఆయన చొరవతోనే పాలమూరుకు కబడ్డీ అకాడమీ మంజూరైంది. అకాడమీ ఏర్పాటుతో నైపుణ్యంగల కబడ్డీ క్రీడాకారులను వెలికితీయవచ్చు.
– కురుమూర్తిగౌడ్, ప్రధాన కార్యదర్శి, జిల్లా కబడ్డీ సంఘం, మహబూబ్‌నగర్
●


