మరికల్: కారు, బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన తీలేర్ స్టేజీ సమీపంలో జరిగింది. పోలీసు లు తెలిపిన వివరాల మేర కు మరికల్ మండలం రా కొండకు చెందిన భరత్ కుమార్‌రెడ్డి(32) బైక్‌పై మంగళవారం అర్ధ రాత్రి కన్మనూర్ నుంచి రాకొండకు బయలుదేరాడు. తీలేర్ స్టేజీ దగ్గరకు రాగానే హైదరాబాద్ నుంచి నారాయణపేటకు వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడుకి భార్య, కుమారుడు, 5 నెలల చిన్నారి ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రం తెలిపారు.
వివాహిత మృతిపై
కేసు నమోదు
ఎర్రవల్లి: వివాహిత మృతిపై కేసు నమోదైన ఘటన ఇటిక్యాల పీఎస్ పరిధిలోని చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ సుధాకర్ కథనం మేరకు.. మండల పరిధిలోని కొండేరు గ్రామానికి చెందిన బోయ నాగవేణి కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తల్లి నర్సమ్మ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఏ ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతురాలికి భర్త ఈరన్న తో పాటు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో
గుడిసె దగ్ధం
కృష్ణా: షార్ట్ సర్క్యూట్‌తో ఓ గుడిసె దగ్ధమై ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బోయ హన్మంతు రాత్రి భోజనం చేసి గుడిసెలో నిద్రపోయాడు. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో గుడిసెకు నిప్పంటుకుంది. నిద్రిస్తున్న హన్మంతుకు ఇది వరకే పక్షపాతం రావడంతో ఆయన కదల్లేని పరిస్థితుల్లో మంటల్లోనే ఉండిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి వృద్ధుడిని ప్రాణాలతో కాపాడి మక్తల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గుడిసెలోని రూ.4.70 లక్షలతో పాటు 4 తులాల బంగారం, 18 తులాల వెండి, సామగ్రి కాలిపోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
పాడైపె పెట్టే ముందు
పసిగట్టారు
తిమ్మాజిపేట: మృతదేహాన్ని పాడైపె పెట్టె ముందు ఒంటిపై గాయాలు గుర్తించి అంత్యక్రియలు ఆగిన ఘటన మండలం ఆవంచలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన అలివేల, యాదయ్య దంపతులు మంగళవారం మధ్యాహ్నం ఘర్షణ పడ్డారు. ఇంతలోనే యాదయ్య పడుకున్న చోటే చనిపోయాడని అంత్యక్రియలకు రావాలని అలివేల బంధువులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చింది. బుధవారం మృతదేహానికి స్నానం చేయించి బట్టలు మారుస్తున్న సమయంలో మెడ, భుజంపైన గాయాలు ఉండడం గుర్తించిన మృతుడి అన్న కుమారుడు అనుమానం వ్యక్తం చేయడంతో అంత్యక్రియలు ఆగాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ శ్రీనివాస్‌రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


