కొండను ఢీకొట్టి జీపు బోల్తా | - | Sakshi
Sakshi News home page

కొండను ఢీకొట్టి జీపు బోల్తా

Jun 24 2026 1:23 AM | Updated on Jun 24 2026 1:23 AM

తీవ్రంగా గాయపడిన చరణ్‌

అదుపుతప్పి బోల్తా పడిన జీపు

మన్ననూర్‌: శ్రీశైలం– హైదరాబాద్‌ ప్రధాన రహ దారి మన్ననూర్‌ సమీపంలోని నిరంజన్‌ షావలీ దర్గా సమీపంలో అదుపుతప్పి జీపు బోల్తా పడిన సంఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అమ్రాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాలు.. అమ్రాబాద్‌ నుంచి అచ్చంపేట వైపు వెళ్తున్న జీపు అదు పుతప్పి కుడివైపున ఉన్న కొండను ఢీకొట్టి బోల్తా పడింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జీపులో ప్రయాణిస్తున్న సుమారు 14 మంది ప్రయాణికుల్లో లక్ష్మాపూర్‌కు చెందిన చరణ్‌, కుమ్మరోనిపల్లికి చెందిన మారెమ్మకు తీవ్రగాయాలు కావడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన విజయ్‌మోహన్‌, రా ధాదేవి, కృష్ణవేణితో పాటూ మరి కొందరిని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అమ్రాబాద్‌ పోలీసులు కేను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హన్మంత్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement