గద్వాలన్యూటౌన్: గద్వాల ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన జములమ్మ అమ్మవారి సన్నిధిలో మంగళవారం వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏటా అమ్మవారు ఫిబ్రవరిలో వచ్చే మాగశుద్ధ పౌర్ణమి రోజు జమ్మిచేడు ఆలయానికి చేరుకుంటారు. ఆ రోజు నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే మాగశుద్ధ పౌర్ణమి నుంచి ఏరువాక పౌర్ణమికి ముందు వచ్చే మంగళవారం వరకు భక్తులు అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరి మంగళవారం కావడంతో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారు. నైవేద్యాలు సమర్పించి, మేకపోతులు అర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సల్లంగా చూడమ్మ జములమ్మ తల్లీ అంటూ భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. పలువురు భక్తులు వివిధ వేషధారణల్లో ఆకట్టుకున్నారు. ఈఓ పురందర్‌కుమార్ పర్యవేక్షణలో సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.


