చేతిరాతే మార్కుల సాధనం | - | Sakshi
Sakshi News home page

చేతిరాతే మార్కుల సాధనం

Mar 2 2026 8:28 AM | Updated on Mar 2 2026 8:28 AM

చేతిరాతే మార్కుల సాధనం

చేతిరాతే మార్కుల సాధనం

ఆంగ్లం.. కాస్త కష్టపడదాం..!

ఉపన్యాస రచన..

అవగాహన

(రీడింగ్‌ కాంప్రహేన్షన్‌)

తెలుగులో.. వెలుగుదాం!

హిందీ చదివేద్దాం.. పదండి!

ప్రశ్నాపత్రం ఇలా..

పార్ట్‌ బీలో...

విశ్లేషణాత్మకంగా..

అక్షరదోషాల నివారణే కీలకం

వ్యాకరణం, పదజాలమే ఆయుధాలు

నారాయణపేట రూరల్‌: పదో తరగతి పరీక్షల్లో మొదటగా లాంగ్వేజ్‌ సంబంధించిన ప్రశ్నాపత్రాలతోనే మొదలవుతాయి. మరికొన్ని రోజుల్లో పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ వంటి లాంగ్వేజ్‌ లో చేతిరాతపై దృష్టి పెడితే అదనపు మార్కులు సొంతం చేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు మూడు గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహించనున్నారు.

అక్షరాలను ఆకట్టుకునే విధంగా గుండ్రంగా రాస్తూ అక్షరదోషాలు లేకుండా ఒకే సైజులో ఉండే విధంగా చూసుకోవాలి. శీర్షికలు, ఉప శీర్షికల కింద అండర్లైన్‌ చేస్తే ఆకర్షణీయంగా ఉంటుంది. సమాధానాలు రాసే సమయంలో సృజనాత్మకత, లేఖ, కరపత్రం, సంభాషణ, వ్యాసం, నినాదాలు, ప్రశ్నావళి తదితర వాటిపై జాగ్రత్తలు పాటించాలి.

అవగాహన, ప్రతిస్పందన అంశంపై అపరిచిత గద్యంలో ఐదు ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. స్వీయ రచనలు వ్యాసరూప ప్రశ్నలు ప్రతిదానికి ఐచ్ఛికముంటుంది. ఒక ప్రశ్నకి ఏడు మార్కులు. సృజనాత్మకతలో ఒక ప్రశ్నకి మరొకటి ఐచ్ఛికంగా ఇస్తారు. దీనికి 7 మార్కులు కేటాయించారు. పార్ట్‌– బీలో భాషాంశాలు, వ్యాకరణాంశాలు ప్రశ్నలుగా వస్తాయి. ప్రతిదానికి ఒక మార్కు ఉంటుంది.

పాఠ్యాంశంలోని అంశాన్ని తీసుకొని సమర్థించండి, అనుగుణంగా రాయండి, విశ్లేషణాత్మకంగా రాయండి.. వంటి ప్రశ్నలకు ఒక్కోపాత్ర మనస్తత్వం మారడానికి కారణాలు వివరించాలి. సోదాహరణంగా రాయండి అంటే ఉదాహరణలతో సమర్థిస్తూ రాయాలి. ఊహించి రాయండి అంటే న్యాయం వైపు నిలబడి మంచి స్పష్టం చేయాలి. ఉపవాచకానికి సంబంధించి ఇతివృత్తం, ప్రాముఖ్యం, పాత్రలు, వాటి ప్రాధాన్యం, వ్యక్తుల ప్రవర్తనశైలి అంశాలతో వచ్చే సందేశాన్ని తెలుసుకోవాలి.

ప్రశ్నాపత్రం సరళి రెండు భాగాలుగా ఉంటుంది. పరిచిత పద్య, గద్యభాగాల నుంచి పది, అపరిచిత గద్యభాగం నుంచి పది మార్కుల ప్రశ్నలు వస్తాయి. 40 మార్కులు విద్యార్థి వ్యక్తీకరణ, సృజనాత్మకత ఆధారంగా ప్రశ్నలుంటాయి. మరో 20 మార్కులు భాష అంశాలకు సంబంధించినవి కేటాయిస్తారు.

అరగంట సమయంలో నాలుగు ఐచ్ఛికాలతో కూడిన 20 ప్రశ్నలు ఉంటాయి. సంజ్ఞ, సర్వనామం, క్రియా, విశేషణం, ఉపసర్గ, ప్రత్యాయం, విలోమ పదాలు, వచనాలు, భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలు, పర్యాయ పదాలు, శబ్ధ భేదాలు, జాతీయాలు, వాక్య నిర్మాణం, విరామ చిహ్నాలు, విభక్తి, అంకెలు హిందీ అక్షరాల్లో మార్చడం, పాఠ్యాంశంలోని కవులు, గ్రంథాలు, బిరుదులు, పురస్కారాలపై ప్రశ్నలుంటాయి.

ఏకాగ్రతతో చదివి పదాలు అర్థం చేసుకొని తప్పులు లేకుండా రాయగలిగితే మంచి మార్కులు సాధ్యం. వ్యాకరణం, పదజాలం, ఉపన్యాస రచన వాటిపై కొంత సాధన చేయాల్సి ఉంటుంది.

ఇందులో సులభంగా 20 మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఒక మెసేజ్‌ డిస్కస్‌కి 10 మార్కులు. ఇందులో రెండు ప్రశ్నలు ఒకదానికి సమాధానం రాయాలి. రెండు చిన్న ఉపన్యాస రచనలకు ఐదు మార్కులు చొప్పున కేటాయిస్తారు. వీటిని పుస్తకంలోని ఎనిమిది థీమ్స్‌ ఆధారంగా ఇస్తారు. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేక పేజీలో రాయాలి. లేఅవుట్‌, సరైన భాష, లింకర్స్‌ తదితర అంశాలు కీలకం.

పార్ట్‌ బీ లో ఒక అపరిచిత పద్యం, గద్యం ఇచ్చి ఐచ్ఛికాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. పుస్తకంలోని ఏ, బీ, సీ రీడింగ్‌ నుంచి ఎడిటింగ్‌, ఐదు పదాలు ఇచ్చి సరి చేయమంటారు. అదే విధంగా ఆబ్జెక్టివ్‌ టైపులో అయిదు కలిపిచ్చి పూరించమంటారు. ఒకాబులరీ సంబంధించి అర్థాలు, వ్యతిరేక పదాలు, నానార్థం, సరైన అర్థం వంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. యాక్టివ్‌వాయిస్‌.. ప్యాసివ్‌వాయిస్‌, రిపోర్టర్‌ స్పీచ్‌, క్వశ్చన్‌ ట్యాగ్‌, కండిషనర్‌ డిగ్రీ కంపారిజన్‌ తదితర ప్రశ్నలు ఉంటాయి.

1 నుంచి 4 ప్రశ్నలకు పాఠ్య పుస్తకంలోని రీడింగ్‌– ఏ విభాగం నుంచి పేరాగ్రాఫ్‌ ఇస్తారు.

5 నుంచి 8 ప్రశ్నలకు బీ, సీ రీడింగ్‌ నుంచి పేరాగ్రాఫ్‌ ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు.

9 నుంచి 12 వరకు ప్రశ్నలు పుస్తకంలో లేని అంశాలను అడుగుతారు. అందుకోసం విద్యార్థులు పాఠ్యపుస్తకంలోని స్టడీస్కిల్క్‌లో ఇచ్చిన అంశాలు సాధన చేయాలి. ముఖ్యంగా టేబుల్స్‌, పైచార్ట్స్‌, బార్‌గ్రాఫ్‌, ప్లోచార్ట్స్‌ వంటి ఇనుపుట్స్‌ ఏదైనా ఇచ్చి ప్రశ్నలు సంధిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement