ఎరువులు అతిగా చల్లితే అనర్థం! | - | Sakshi
Sakshi News home page

ఎరువులు అతిగా చల్లితే అనర్థం!

Mar 2 2026 8:28 AM | Updated on Mar 2 2026 8:28 AM

ఎరువు

ఎరువులు అతిగా చల్లితే అనర్థం!

అలంపూర్‌: పంటసాగులో రైతులు అత్యధికంగా రసాయనక ఎరువుల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. ఎరువులు ఖరీదైనవి, విలువైనవిగా ఉంటాయి. దేశంలో తయారయ్యే ఎరువులు అవసరాలకు చాలక దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎరువుల ధరలు అధికంగా ఉండడంతో అన్నదాతలు వాటిని కొనుగోలు చేయడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ఎరువులను పొదుపుగా వినియోగించుకోని పెట్టుబడిలో ఆదా చేసుకోవాలని అలంపూర్‌ ఏఓ నాగార్జున్‌రెడ్డి సూచించారు.

ఎరువులను ఎలా వాడుతున్నాం?

నత్రజని, భాస్వరం, పొటాష్‌ను ఆహార పంటలకు 4:2:1 నిష్పత్తిలో వాడాలని సిఫార్సు చేస్తున్నారు. రైతులు భాస్వరం, పొటాష్‌ను అవసరంకన్నా.. తక్కువ, నత్రజనిని సిఫార్సు చేసిన దానికంటే అధికంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. అవసరం లేని పోషకాన్ని వేసి వృథా చేయడంతో ఖర్చు పెరగడం, పోషకాల సమతుల్యత లోపించడం, దిగుబడి తగ్గడం, నేల క్షీణిస్తుందని పేర్కొన్నారు.

పొదుపు సాధ్యం ఎలా?

పంటకు అవసరమైన మేర ఎరువులను అందించడం, వేసిన ఎరువులను సమర్థవంతంగా మొక్క తీసుకునేలా చేయడంతో ఎరువుల ఖర్చును తగ్గించుకోనే అవకాశం ఉంటుంది. ఇది సాధించడానికి నాలుగు అంశాలను పరిగణంలోకి తీసుకోవాలని సూచించారు.

ఎంత వేయాలి: నేలలో మొక్కకు కావాల్సిన పోషకాలు కొద్దోగొగోప్పో అందుబాటులో ఉంటాయి. నేల లక్షణాలను బట్టి పోషకాల లభ్యతలో తేడాలు ఉంటాయి. వేసే పైరును బట్టి నేలలోని పోషకాల ఆధారంగా ఏ పోషకం ఎంత వరకు వేయాలని నిర్ధారించుకొని వేసుకోవాలి.

వేసే పద్ధతి: ఎరువులు ఎంత మేరకు వేయాలన్నది.. ఎంత ముఖ్యమో వాటిని వేయాల్సిన పద్ధతి అంతే ముఖ్యం. సరైన పద్ధతిలో ఎరువులు వేసినప్పుడు మొ క్కలు పోషకాలను బాగా వినియోగించుకుంటాయి.

వెదజల్లే పద్ధతి: విత్తడానికి, నాటడానికి ముందు పైపాటుగా ఎరువులు పొలంలో సమానంగా పడేలా చల్లడాన్ని వెదజల్లే పద్ధతి అంటారు. మొక్కలు పొలం నిండా దగ్గరగా ఉండి వరుసల్లో లేని పైర్లు, వేళ్లు భూమిలో అల్లుకొని ఉండే పైర్లకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. మాగాణి వరికి అనువైన పద్ధతి.

మొదళ్ల వద్ద వేయడం

పొలం మీద ఎరువులు వేదజల్లడం కన్న వేళ్ల వద్ద ఎరువులు వేయడం మేలైన పద్ధతి. తక్కువ ఎరువుతో ఎక్కువ పోషకం మొక్కకు అందేలా చేయవచ్చు. దూరందూరంగా మొక్కలు ఉన్నప్పుడు వేళ్లు తక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నప్పుడు భూసారం తక్కువగా ఉన్న నేలలకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.

గొర్రుతో వేయడం

మెరుగుపర్చబడిన ఈ నాటి గొర్రు(సీడ్‌ కం ఫర్టిలైజర్‌ డ్రిల్‌) సహాయంతో విత్తనం, ఎరువు కావాల్సినంత దూరంలో, కావాల్సిన లోతులో పడేలా వేయవచ్చును. విత్తనం వేసేదానికి 5 సెంమీ లోతులో 5సెం.మీ దూరంలోనూ ఎరువు పడితే మొలకెత్తగానే వేళ్లకు పోషకాలు అందుబాటులో ఉంటాయి. ఎరువు వేసే సమయాల్లో విత్తనానికి తగలకుండా జాగ్రత్త పడాలి. మొట్ట, ఆరుతడి పైర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

గుంటల్లో వేయడం:

మొక్క మొదళ్ల వద్ద తేమగా ఉన్నప్పుడు 6 లేకా 7 సెం.మీల లోతులో చిన్న గుంత తీసి ఎరువు వేసి మట్టితో కప్పి పెట్టాలి. దీనివల్ల వేళ్లకు దగ్గరగా పోషకాలు అందుబాటులో ఉండి శక్తివంతంగా ఉపయోపడతాయి. వృథా అయ్యే శాతం తక్కువ. నీటి వసతితో సాగుచేసే పత్తి, మిరప, అరటి, చెరుకు పంటలకు ఈ విధంగా ఎరువులు వేయవచ్చు.

వరుసల్లో వేయడం

మొక్కకు మొక్కకు దూరం తక్కువైనప్పుడు వరుసలో ఒక పక్కగాని రెండు పక్కలు గాని 4 నుంచి 5 సెంమీ లోతైన నాగలి చాలు తీసిగాని, గొర్రుతో గాని, చేతితోగాని ఎరువు వేయాలి.

ఎరువులు అతిగా చల్లితే అనర్థం! 1
1/3

ఎరువులు అతిగా చల్లితే అనర్థం!

ఎరువులు అతిగా చల్లితే అనర్థం! 2
2/3

ఎరువులు అతిగా చల్లితే అనర్థం!

ఎరువులు అతిగా చల్లితే అనర్థం! 3
3/3

ఎరువులు అతిగా చల్లితే అనర్థం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement