నెట్‌బాల్‌ చాంపియన్‌ మహబూబ్‌నగర్‌ | - | Sakshi
Sakshi News home page

నెట్‌బాల్‌ చాంపియన్‌ మహబూబ్‌నగర్‌

Feb 24 2026 7:40 AM | Updated on Feb 24 2026 7:40 AM

నెట్‌

నెట్‌బాల్‌ చాంపియన్‌ మహబూబ్‌నగర్‌

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో నిర్వహించిన రెండో ఎడిషన్‌ రాష్ట్రస్థాయి సీఎం కప్‌ నెట్‌బాల్‌ పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. రాష్ట్రస్థాయి పోటీలతో నాలుగు రోజుల నుంచి స్టేడియంలో సందడి నెలకొంది. నెట్‌బాల్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో బాల, బాలికల విభాగాల్లో మహబూబ్‌నగర్‌ జట్లు చాంపియన్లుగా నిలవడం విశేషం. టోర్నీలో మొదటి నుంచి మెరుగైన ప్రతిభ కనబరిచిన ఆతిథ్య మహబూబ్‌నగర్‌ బాల, బాలికల జట్లు ఫైనల్‌లో విజయ కేతనం ఎగురవేశాయి. బాలుర విభాగంలో రన్నరప్‌గా నారాయణపేట, బాలికల విభాగంలో రన్నరప్‌గా మేడ్చల్‌ జట్లు నిలిచాయి. బాలుర విభాగంలో మూడో స్థానంలో నల్గొండ–కామారెడ్డి జట్లు, బాలికల విభాగంలో మూడో స్థానంలో ఖమ్మం– నిజామాబాద్‌ జట్లు సంయుక్తంగా నిలిచాయి.

విజేతలకు ట్రోఫీ బహూకరణ

విన్నర్‌, రన్నర్‌, మూడోస్థానంలో నిలిచిన జట్లకు ఏఎస్‌పీ రత్నం, ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్‌ తదితరులు ట్రోఫీలు, మెడల్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్‌పీ రత్నం మాట్లాడుతూ క్రీడలతో దేహదారుఢ్యంతో పాటు మానసికంగా ధృడంగా ఉంటారన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎన్‌పీ వెంకటేశ్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం క్రీడలను విస్మరించగా.. క్రీడాభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి సీఎం కప్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి క్రీడా పోటీలతో క్రీడాకారుల నైపుణ్యం వెలికితీయొచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్‌.శ్రీనివాస్‌, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి కిషోర్‌, నెట్‌బాల్‌ అసోసియేషన్‌ తెలంగాణ అధ్యక్షుడు విక్రమాదిత్యారెడ్డి, అంజద్‌అలీ, కోచ్‌ అబ్దుల్‌ షరీఫ్‌, పీడీలు వేణుగోపాల్‌, బాల్‌రాజు, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫైనల్‌ పోరు..

బాలుర విభాగంలో ఫైనల్‌ మ్యాచ్‌లో మహబూ బ్‌నగర్‌ జట్టు 20–14 పాయింట్ల తేడాతో నారాయణపేట జట్టుపై, బాలికల విభాగం ఫైనల్‌ మ్యా చ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 23–18 పాయింట్ల తేడాతో మేడ్చల్‌ జట్లను మట్టికరిపించాయి.

బాలుర, బాలికల విభాగంలో జిల్లా జట్ల ప్రతిభ

రన్నరప్‌లుగా మేడ్చల్‌, నారాయణపేట

ముగిసిన రాష్ట్రస్థాయి సీఎం కప్‌ నెట్‌బాల్‌ పోటీలు

నెట్‌బాల్‌ చాంపియన్‌ మహబూబ్‌నగర్‌ 1
1/1

నెట్‌బాల్‌ చాంపియన్‌ మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement