ఎట్టకేలకు టెండర్లు ఖరారు
అడ్డాకుల: మండలంలోని కందూర్ రామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద ఎట్టకేలకు సోమవారం టెండర్లను ఖరారు చేశారు. ఆలయ ఉద్యోగుల అవినీతి బాగోతం బయటపడిన తర్వాత శివరాత్రికి ముందే నిర్వహించాల్సిన టెండర్లను అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్‌రెడ్డి సమక్షంలో చేపట్టారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో ఆలయం వద్ద కొబ్బరికాయలు, లడ్డూ, పులిహోర విక్రయాలు, తలనీలాలు, కొబ్బరిచిప్పల సేకరణకు బహిరంగ వేలం నిర్వహించారు. టెండర్ల ద్వారా స్వామివారికి సుమారు రూ.27.38 లక్షల ఆదాయం సమకూరనుంది. కొబ్బరికాయల విక్రయాలను నవాబుపేట మండలం కాకర్లపహాడ్‌కు చెందిన ఎస్.వెంకటయ్య రూ.14.35 లక్షలకు చేజిక్కించుకున్నారు. లడ్డూ, పులిహోర విక్రయాలను కందూర్ గ్రామానికి చెందిన వి.మనోహర్ రూ.9.66 లక్షలకు, తలనీలాలను కోస్గికి చెందిన కె.రవికుమార్ రూ.2.35లక్షలకు, కొబ్బరి చిప్పల సేకరణను చిన్నచింతకుంట మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన టి.ఆంజనేయులు రూ.99 వేలకు దక్కించుకున్నారు.
అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు
దేవుడి సొమ్మును ఉద్యోగులే పక్కదారి పట్టించారన్న ఆరోపణల నేపథ్యంలో ఉత్సవాలు పూర్తయ్యే వరకు అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్‌రెడ్డినే బాధ్యతలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఆలయంలో అవినీతి బాగోతాన్ని నాన్చకుండా త్వరగా తేల్చే విధంగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు.
అన్నదాన ట్రస్టు లెక్కలపై గందరగోళం


