‘న్యాయవాదుల రక్షణచట్టం అమలు చేయాలి’
భూత్పూర్: న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని కోరుతూ సోమవారం భూత్పూర్ చౌరస్తా నుంచి హైదరాబాద్‌కు న్యాయవాదులు పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. నవంబర్ 9న అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో 12మంది న్యాయవాదులు పాదయాత్రగా హైదరాబాద్ వెళ్తుండగా.. నవంబర్ 14న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సమావేశంలో న్యాయవాదుల రక్షణ చట్టంపై చర్చించి అమలు చేయడానికి మాట్లాడుతామని చెప్పడంతో భూత్పూర్‌లోనే పాదయాత్ర ముగించినట్లు పేర్కొన్నారు. ఐదునెలలు గడిచినా ఎలాంటి హామీ రాకపోవడంతో ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్, హైకోర్టు బార్ అసోసియేషన్‌తో చర్చించి ఎక్కడైతే పాదయాత్ర నిలిపివేశామో అక్కడి నుంచి తిరిగి పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులతో కలిసి పాదయాత్రగా హైదరాబాద్ తరలివెళ్లారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్, మక్తల్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.
‘న్యాయవాదుల రక్షణచట్టం అమలు చేయాలి’


