ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్‌ ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్‌ ఇవ్వాలి

Feb 24 2026 7:40 AM | Updated on Feb 24 2026 7:40 AM

ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్‌ ఇవ్వాలి

ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్‌ ఇవ్వాలి

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): అర్హులైన ప్రతి డెస్క్‌ జర్నలిస్టు, రిపోర్టర్లకు అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వాలని జర్నలిస్టులు నినదించారు. పాలమూరు ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సోమవారం మహబూబ్‌నగర్‌లోని టీఎన్‌జీఓ భవన్‌లో జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షు డు నరేంద్రచారి, వివిధ పత్రికల బ్యూరో ఇన్‌చార్జిలు, ఎడిషన్‌ ఇన్‌చార్జిలు కిషోర్‌కుమార్‌, హరిప్రసాద్‌, రవీందర్‌రెడ్డి, తిరుపతయ్య, వెంకటేశ్వరావు, నరేష్‌కుమార్‌, మాట్లాడారు. అక్రిడిటేషన్‌ కార్డుల జారీలో సమాచార పౌర సంబంధాల శాఖ విడుదల చేసిన జీఓ 252ను సవరించి పాత జీఓ ప్రకారం ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్‌ కార్డులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఉన్న దాని ప్రకారం ఎడిషన్‌ కేంద్రంలో రిపోర్టర్లకు 8 ప్లస్‌ 3, అదేవిధంగా డెస్క్‌ జర్నలిస్టులకు ఎడిషన్‌ సెంటర్‌లో 8 ఇవ్వాలని కోరారు. దీంతో పాటు ఎడిషన్‌ లేని కేంద్రాలైన మిగతా నాలుగు జిల్లాల్లో రిపోర్టర్లు సంబంధించి 3, డెస్క్‌ జర్నలిస్ట్‌లకు 5 చొప్పున మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున అదనపు అక్రిడిటేషన్‌ కార్డు ఇవ్వాలని కోరారు. ఆయా డిమాండ్లను పరిష్కరించే దాక ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. పత్రికల్లో జిల్లాకేంద్రాల్లో పనిచేస్తు న్న జర్నలిస్టుల గొంతునొక్కే ప్రయత్నాన్ని మానుకోవాలని హితవు పలికారు. అనంతరం తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించి, బైక్‌ ర్యాలీగా కలెక్టరేట్‌ చేరుకుని కలెక్టర్‌ విజయేందిర, డీపీఆర్‌ఓ శ్రీనివాస్‌లకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ కార్యదర్శి నరేందర్‌, టీ యూడబ్ల్యూజేఎఫ్‌ అధ్యక్షుడు వాకిటి అశోక్‌, డెస్క్‌ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి మల్లెల విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపా ధ్యక్షుడు కుర్మయ్య, మాణిక్‌రావు, రామస్వామి, రాజు, చెన్నకేశవులు, నవీన్‌, ప్రేమ్‌కుమార్‌, సత్య నారాయణ, భరత్‌, బాలు, హరికృష్ణ, రిపోర్టర్లు రవి, యాదయ్య, సతీష్‌, ధర్మ, సాబేర్‌, పాషా, మూర్తి, గోపాల్‌, డెస్క్‌ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement