సీఎం కప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాలు | - | Sakshi
Sakshi News home page

సీఎం కప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాలు

Feb 24 2026 7:40 AM | Updated on Feb 24 2026 7:40 AM

సీఎం

సీఎం కప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఖమ్మంలో జరిగిన రెండో ఎడిషన్‌ రాష్ట్రస్థాయి సీఎం కప్‌ ఆర్చరీ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటారు. కృతిక్‌ శ్రీవాస్తవ్‌ వెండి పతకం, స్మృతి సన్నిభా వెండి పతకాలు సాధించారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన సీఎం కప్‌ రాష్ట్రస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌లో జిల్లా క్రీడాకారిణి వి.సహస్ర 86+ కేటగిరీలో స్నాచ్‌ 75కిలోలు, క్లీన్‌ జర్క్‌ 90 కిలోల మొత్తం 165 కిలోల బరువు ఎత్తి బంగారు పతకం సాధించింది.

● హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో సోమవారం ముగిసిన రెండో ఎడిషన్‌ సీఎం కప్‌ హ్యాండ్‌బాల్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో మహబూబ్‌నగర్‌ బాలికల జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్‌.శ్రీనివాస్‌ అభినందించారు.

సీఎం కప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాలు 1
1/3

సీఎం కప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాలు

సీఎం కప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాలు 2
2/3

సీఎం కప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాలు

సీఎం కప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాలు 3
3/3

సీఎం కప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement