పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కళాళాలలకు సంబంధించి డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను గురువారం పీయూ వీసీ జి.ఎన్.శ్రీనివాస్ వెల్లడించారు. ఇందులో భాగంగా సెమిస్టర్–1లో 30.08 శాతం, 3లో 39.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఆయన పేర్కొన్నారు. పీయూ పరిపాలన భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.రమేష్‌బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డా.కె.ప్రవీణ, ఎగ్జామినేషన్ కో–ఆర్డినేటర్ డా.అరుంధతిరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గౌతం పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను త్వరగా పూర్తి చాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్ని మండలాల బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లను ఆదేశించారు. గురువారం తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం నుంచి బీఎల్‌ఓలతో సూపర్‌వైజర్లు ఇంటింటికీ తిరిగి ఎస్‌ఐఆర్–2025 మ్యాపింగ్ విషయంలో జాప్యంపై వివరాలు తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మ్యాపింగ్‌లో పురోగతిని సమీక్షించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు క్రమం తప్పకుండా ప్రతిరోజు మధ్యాహ్నం వరకు ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ చేసేందుకు కృషి చేయాలన్నారు. వచ్చే నెలలో ఎస్‌ఐఆర్ ప్రారంభించే అవకాశం ఉందని, అంత వరకే క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు పని పూర్తిచేయాలన్నారు. వీసీలో మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్లు పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాల
పోస్టర్ల ఆవిష్కరణ
స్టేషన్ మహబూబ్‌నగర్: తెలంగాణ సాహితీ దశాబ్ది సాహిత్యోత్సవాల పోస్టర్లను గురువారం జిల్లాకేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఆ సంస్థ జిల్లా శాఖ కార్యవర్గం సభ్యులు ఆవిష్కరించారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర శాఖ ఏవీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లోని ఏవీ కళాశాల ప్రాంగణంలో సాహిత్య ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వల్లభాపురం జనార్దన్, జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ఖాజామైనొద్దీన్, కొప్పొలు యాదయ్య తెలిపారు. కార్యక్రమంలో ప్రచార కార్యదర్శి ఆర్.ప్రమోద్‌కుమార్, కార్యవర్గ సభ్యులు కేఎల్ సత్యవతి, పులి జమున, రామదాసు, పట్నం చెన్నయ్య, విజేత వెంకటరెడ్డి పాల్గొన్నారు.
పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల


