
మెప్మా రుణ ప్రణాళిక ఖరారు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఎట్టకేలకు మెప్మా పరిధిలో 2025–26 ఆర్థికసంవత్సరానికి రుణ ప్రణాళిక ఖరారైంది. మహబూబ్‌నగర్ నగరంతో పాటు జడ్చర్ల, భూత్పూర్ పట్టణాలకు చెందిన 740 స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ)లకు మొత్తం రూ.93,47,42,000 ఇవ్వనున్నారు. ఇందులో బ్యాంకు లింకేజీ కింద మహబూబ్‌నగర్‌లోని 466 మహిళా సంఘాలకు రూ.57,93,40,000 కేటాయించారు. జడ్చర్లలోని 167 సంఘాలకు రూ.22,61,24,000, భూత్పూర్‌లోని 77 సంఘాలకు రూ.12,63,78,000 ఇవ్వనున్నారు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌ఈపీ) కింద 30 యూనిట్లకు గాను రూ.29 లక్షలు కేటాయించారు. వీటిలో మహబూబ్‌నగర్ నగర పరిధిలోని 19 మందికి రూ.లక్ష చొప్పున ఇవ్వనున్నారు.
● గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో మూడు పట్టణాలకు కలిపి బ్యాంకు లింకేజీ కింద 632 ఎస్‌హెచ్‌జీలకు రూ.74,01,40,000 ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా.. 742 ఎస్‌హెచ్‌జీలకు రూ.86,86,18,000 ఇచ్చారు. ఇందులో మహబూబ్‌నగర్ నగర పరిధిలోని 428 ఎస్‌హెచ్‌జీలకు రూ.52,64,00,000 ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే.. 543 గ్రూపులకు రూ.70,62,18,000 ఇచ్చారు. జడ్చర్లలో 114 గ్రూపులకు రూ.12,08,02,000 ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే.. 121 గ్రూపులకు రూ.10,79,00,000 ఇచ్చారు. భూత్పూర్‌లోని 67 ఎస్‌హెచ్‌జీలకు రూ.9,06,38,000 ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే.. 59 గ్రూపులకు రూ.5,16,00,000 ఇచ్చారు. ఇక ఎస్‌ఈపీ కింద మూడు పట్టణాలకు కలిపి 23 గ్రూపులకు రూ.23 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే 19 గ్రూపులకు రూ.29 లక్షలు ఇచ్చారు.
2025–26లో బ్యాంకు లింకేజీ కింద రూ.93.18 కోట్లు
ఎస్‌హెచ్‌జీలకు ఎస్‌ఈపీ కింద మరో రూ.29 లక్షలు
మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్ పట్టణాలలో 740 మహిళా గ్రూపులకు లబ్ధి
గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో లక్ష్యాన్ని దాటిన వైనం