
ఎత్తంలో తుపాకీ కలకలం
కోడేరు: ఓ వ్యక్తి తుపాకీతో తిరుగుతూ కలకలం సృష్టించిన సంఘటన మండలంలోని ఎత్తం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మండ్ల లక్ష్మయ్య శనివారం అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అతడిని పట్టుకుని విచారించగా జేబులో తుపాకీ కనిపించింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ జగదీశ్వర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణయ్య తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లక్ష్మయ్య నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీ ఇదే..