
భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లావ్యాప్తంగా గుడ్‌ఫ్రైడే వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లోని కల్వరి ఎంబీ చర్చి, శాలెం, క్రిస్టియన్‌పల్లిలోని బెత్లహం, క్రిస్టియన్‌కాలనీలోని ఎంబీ ప్రేయర్, మోతీనగర్‌లోని చర్చితో పాటు ఇతర చర్చిల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పాస్టర్లు క్రీస్తూ సందేశం ఇచ్చారు. బైబిల్ సూక్తులను చదివి వినిపించారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించాచాలని, పరస్పరం కష్ట, సుఖాల్లో పాలుపంచుకోవాలన్నారు. క్రీస్తు ప్రభువు శిలువపై పలికిన ఏడు మాటల గురించి వివరించారు. కల్వరి ఎంబీ చర్చిలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్, సీనియర్ పాస్టర్ రెవరెండ్ వరప్రసాద్ క్రీస్తూ సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ జేకబ్, కార్యదర్శి జేఐ డేవిడ్, సహ కోశాధికారి టైటస్ రాజేందర్, ఆర్‌ఎస్ డేవిడ్, పి.శామ్యుల్, జేఐ.యోహాన్, ఎంకే.పాల్ సుధాకర్, జీపీ ప్రసన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాప విముక్తి కోసమే యేసు శిలువ త్యాగం
యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవాళికి పాప విముక్తి కల్పించేందుకే శిలువ త్యాగం చేశారని రెమా వర్షిప్ సెంటర్ డైరెక్టర్, రెవరెండ్ పాస్టర్ బీఎస్ పరంజ్యోతి అన్నారు. రెమా వర్షిప్ సెంటర్‌లో ప్రార్థనలు నిర్వహించారు. పరంజ్యోతి ప్రసంగిస్తూ యేసు క్రీస్తూ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ఆయనకు సాక్షులుగా రాణించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు దేవయ్య, డాక్టర్ ప్రేమ్‌చంద్, భరత్, లక్ష్మన్న, రాజు, ప్రసన్నకుమార్, చంద్రశేఖర్, బ్లాండీనా, మహిమ తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే