
మొక్కజొన్న క్వింటాల్ రూ.2,447
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం మొక్కజొన్న గరిష్టంగా రూ.2,447, కనిష్టంగా రూ.2,056 ధరలు లభించాయి. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ రకం గరిష్టంగా రూ.2,296, కనిష్టంగా రూ.2,070 ధరలు పలికాయి.
సోనామసూరి క్వింటాల్ రూ.2,500
దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్ యార్డులో శనివారం జరిగిన టెండర్లలో సోనామసూరి ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,500, కనిష్టంగా రూ.2,400 ధరలు నమోదయ్యాయి. సీజన్ లేకపోవడం వల్ల మార్కెట్‌కు తక్కువ మొత్తంలో ధాన్యం అమ్మకానికి వచ్చింది. మార్కెట్‌కు ఆదివారం ప్రభుత్వ సెలవు కాగా సోమవారం బక్రీద్ పండుగ సెలవు ఇచ్చారు. తిరిగి మంగళవారం మార్కెట్‌లో లావాదేవీలు కొనసాగుతాయి.
పోలీస్ సిబ్బందినిసన్మానించిన ఐజీ
మహబూబ్‌నగర్ క్రైం: దళిత యువతి లైంగిక దాడి కేసులో నిందితుడు గోదా మల్లికార్జున్‌కు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడేవిధంగా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని శనివారం డీఐజీ కార్యాలయంలో ఐజీ సుధీర్‌బాబు, డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ ఘనంగా సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితుడికి శిక్ష పడేవిధంగా సిబ్బందితో పాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్స్‌ను అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.