
ముంపుపై ముందుచూపేది..?
పట్టించుకోవడం లేదు..
వరద ముంపు నుంచి తమను కాపా డాలని ప్రతి ఏడాది అధికారులు, పాలకులకు విజ్ఞప్తి చేస్తు న్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. తమ కాలనీల సమస్యల శాశ్వత పరిష్కారం, అభివృద్ధి కోసం చర్య లు తీసుకుంటలేరు. ఇప్పటికై నా తమ సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలి. – నయీమ్, రాజీవనగర్, బాదేపల్లి
చర్యలు తీసుకుంటాం
జడ్చర్ల పట్టణంలో లోత ట్టు ప్రాంతాలను గుర్తించి వరద ముప్పు వాటిళ్లకుండా చర్యలు చేపడుతాం. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. వీటిపై త్వరలోనే సమగ్ర అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారానికి కృషిచేస్తాం.
– రాజయ్య, మున్సిపల్ కమిషనర్, జడ్చర్ల
● భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్న మున్సిపాలిటీ
● లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి
చేరుతున్న వరద నీరు
● ఇబ్బందుల పాలవుతున్న కాలనీలవాసులు
● ప్రతిఏటా వానాకాలంలో ఇదే తీరు
● పట్టించుకోని పాలకులు, అధికారులు
జడ్చర్ల: కావేరమ్మపేట, బాదేపల్లి పరిధిలోని పలు కాలనీలు వరద ముంపునకు గురవుతున్నాయి. వర్షం వచ్చిందంటే చాలు భారీగా వరద నీరు చేరుతుండడంతో కాలనీలు నీట మునుగుతున్నాయి. ఇళ్లలోకి సైతం వరద రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వరద నీటితోపాటు కాల్వల ద్వారా మురుగు నీరు సైతం ఇళ్లలోకి వస్తుండటంతో కంపు వాసనతో తల్లడిల్లుతున్నారు.
నాలాలు ఆక్రమించడంతో..
వరద నీరు ముందుకు ప్రవహించే విధంగా సరైన కాల్వలు లేకపోవడంతో ఎక్కడికక్కడ నీరు రోడ్లపైకి వచ్చి కాలనీలను ముంచెత్తుతున్నాయి. నల్లకుంట ప్రాంతంలో ఓ కాల్వ నిర్మించినా నేతాజీ చౌరస్తా– సిగ్నల్‌గడ్డ ప్రధాన రహదారిపై డ్రెయినేజీలు మూసుకుపోవడం, నాలాలను ఆక్రమించడంతో రోడ్లపై నీరు పారుతూ కాలనీలను ముంచెత్తుతున్నాయి. అదేవిధంగా శాంతినగర్, శివాజీనగర్ తదితర కాలనీలు ఇదే కోవలో ఉన్నాయి. దశాబ్దాల కిందట నిర్మించిన చిన్నపాటి డ్రెయినీలు ఒక్కసారి గా నిండి తక్కువ ఎత్తులో నిర్మించిన ఇళ్లలోకి చేరుతున్నాయి. ఇక రాజీవ్‌నగర్‌కాలనీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పై ప్రాంతం నుంచి భారీ వరద వస్తే కాలనీ మొత్తం ముంపునకు గురవుతోంది.
● వరద నీరుకు తోడు నాలాలను ఆక్రమించడంతో సమస్య జఠిలంగా మారింది. పట్టణంలోని పలు కాలనీల్లో మురుగు కాల్వలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకోవడం, వాటిపై మెట్లు తదితర నిర్మాణాలు చేపట్టడంతో నాలాలు మూసుకుపోయి వరద ముందుకు ప్రవహించని పరిస్థితి నెలకొంది. అంతేగాక మురుగు కాల్వలు దశాబ్దాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించినవి కావడంతో మురుగు ముందుకు వెళ్లలేని విధంగా మారాయి.
పరిష్కార మార్గాలేమిటి..?
మున్ముందు ముంపు బాధ తప్పాలంటే పాలకులు, అధికారులు శాశ్వత పరిష్కారానికి కృషి చే యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటిని గుర్తించి దారి మళ్లించేలా చర్యలు చేపట్టాలి. వరద నీరు సాఫీగా ముందుకు వెళ్లేందుకు భారీ కాల్వలు నిర్మించడంతోపాటు నీటి ప్రవాహానికి అవరోధం కలిగే విధంగా చెత్తాచెదారం అడ్డు లేకుండా చేస్తే కొంత ప్రయోజనం ఉంటుంది.

ముంపుపై ముందుచూపేది..?

ముంపుపై ముందుచూపేది..?