Telangana Crime News: మళ్ళీ కలకలం రేపుతున్న క్షుద్రపూజలు!
Sakshi News home page

మళ్ళీ కలకలం రేపుతున్న క్షుద్రపూజలు!

Jan 4 2024 12:36 AM | Updated on Jan 4 2024 10:16 AM

- - Sakshi

పట్టుబడిన నిందితులు

బాలానగర్‌: మండల పరిధిలోని చెన్నంగులగడ్డ గ్రామపంచాయతీ ఎక్వాయిపల్లిలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్న విషయాన్ని గ్రామస్తులు గమనించారు. దీంతో అక్కడకు చేరుకుని క్షుద్ర పూజలు చేయడానికి వచ్చిన ఐదుగురిని పట్టుకోబోగా.. అందులో ఒకరు తప్పించుకున్నారు. నలుగురిని బంధించి పోలీసులకు అప్పగించారు.

క్షుద్ర పూజలు చేయడానికి ఎక్కడ నుంచి వచ్చారు? ఎందుకోసం చేస్తున్నారని? వారిని గ్రామస్తులు ప్రశ్నించగా.. తాము హైదరాబాద్‌, నారాయణ్‌కేడ్‌ ప్రాంతాలకు చెందిన వారుగా చెప్పారు. క్షుద్రపూజలు చేసి బంగారం తవ్వి తీయడానికి వచ్చినట్లు వివరించారు. ఈ సంఘటనలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని బాలానగర్‌ స్టేషన్‌కు తరలించి, విచారణ చేపడుతున్నామని ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement