
సద్దలగుండు వద్ద మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు కనీసం డిపాజిటైనా దక్కదని రాష్ట్ర ఎకై ్సజ్, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం క్రిస్టియన్‌పల్లిలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల గ్రౌండ్స్‌లో వాకర్స్‌తో కలిసి కొద్దిసేపు నడిచి తనకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంబీసీ, న్యూమోతీనగర్‌లోని మెథడిస్ట్ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశా రు. అనంతరం స్థానిక వన్‌టౌన్ నుంచి గిర్నీగడ్డ వరకు, అలాగే రాత్రి ప్రేమ్‌నగర్, సద్దలగుండు తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ, హబీబ్‌నగర్, సద్దలగుండు వద్ద కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది అభివృద్ధి మంత్రమైతే, ప్రతిపక్షాలది మాత్రం కుల మతాల కుతంత్రమని ఎద్దేవా చేశారు. ఈ పదేళ్లలో ఎవరూ ఊహించని రీతిలో వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. ముఖ్యంగా దివిటిపల్లిలోని ఐటీ టవర్‌కు అమరరాజా లిథియం అయాన్ పరిశ్రమను తీసుకొచ్చామన్నారు. దీని ద్వారా సుమారు పది వేల మందికి పైగా ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో ఆయా వార్డు కౌన్సిలర్లు జలీల్ పాషా, జి.సంధ్య, రామ్‌లక్ష్మణ్ పాల్గొన్నారు.

కార్నర్ మీటింగ్‌కు హాజరైన ప్రజలు