రైతులు నష్టపోకుండా చూస్తాం | - | Sakshi
Sakshi News home page

రైతులు నష్టపోకుండా చూస్తాం

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

● ఏఐసీసీ పరిశీలకుడు వేగి వెంకటేష్‌

మహబూబాబాద్‌ రూరల్‌: ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, రైతుల నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏఐసీసీ పరిశీలకుడు వేగి వెంకటేష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓట్‌ బచావో, దేశ్‌ బచావో, ఎల్‌ నినో ప్రభావం సన్నద్ధత, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఏఐసీసీ పరిశీలకుడు వెంకటేష్‌ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫుర పోటీ చేస్తున్న రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలన్నారు. ప్రధాని మోదీ, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ కలిసి 13 కోట్ల ఓట్లను తొలగించారని, దీనిపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ తీవ్ర పోరాటం చేస్తున్నారన్నారు. దీనిపై గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ నెల 25నుంచి వచ్చేనెల 25వ తేదీ వరకు ప్రత్యేక కార్యాచరణ జరగనుందని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్‌ రాంచంద్రునాయక్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత కరువుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కారణమని బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వారి మాట లను తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వరికి బదులు తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు గుగులోతు జ్యోతి, మీసాల ప్రగతి, భూక్య సుజాత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement