చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

Oct 27 2026 12:56 AM | Updated on Oct 27 2026 12:56 AM

తొర్రూరు: పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని స్థానిక జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి దామెర ధీరజ్‌కుమార్‌ తెలిపారు. డివిజన్‌ కేంద్రంలోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. బాలల హక్కులు, బాల్య వివాహాల నిరోధం, ర్యాగింగ్‌ నిరోధక చట్టాలు, మహిళల రక్షణ చట్టాలు, లైంగిక వేధింపుల నిరోధక చట్టం, పోక్సో యాక్టు గురించి వివరించారు. ఎక్కడైనా బాలికలు వేధింపులకు గురైతే వెంటనే 1098, 112 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. బాలికలు ‘గుడ్‌ టచ్‌–బ్యాడ్‌ టచ్‌’పై అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. లైంగిక దాడుల నుంచి బాలికలను సంరక్షించడానికి పోక్సో చట్టాన్ని అమల్లోకి తెచ్చారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, ప్రిన్సిపాల్‌ విజయ రత్నమాల, న్యాయవాది అశోక్‌ పాల్గొన్నారు.

జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి ధీరజ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement