● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: ప్రజావాణి వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. కలెక్టర్ స్వయంగా వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖల వారీగా బ్యాక్‌లాగ్ వేకెన్సీల నివేదికను వెంటనే సమర్పించాలన్నారు. ఎన్‌నినో కారణంగా జిల్లా వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు. వసతి గృహాల నిర్వహణ, కార్యాలయ విధుల ముఖచిత్రం హాజరు, శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. పెండింగ్ వినతులు కూడా త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.


