● డిసెంబర్ 9న లక్ష విల్లంబులతో
హైదరాబాద్‌లో బహిరంగసభ
● తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు
మైపతి అరుణ్‌కుమార్
బయ్యారం: ఆదివాసీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులతోపాటు ఆదివాసీలకు దక్కాల్సిన ఫలాల దోపిడీకీ వ్యతిరేకంగా డిసెంబర్ 9న హైదరాబాద్‌లో లక్ష విల్లంబులతో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు తు డుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్‌కుమార్ తెలిపారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు నరసింహారావు అధ్యక్షతన ఆదివారం బయ్యారంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయినా ఆదివాసీల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లోని ఉద్యోగాలను జోనల్ విధానం పేరిట మైదానప్రాంతం వారు దక్కించుకుంటున్నారని అన్నారు. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగసభను జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో నాయకులు రాంప్రసాద్, లక్ష్మణ్‌రావు, వెంకటేశ్వర్లు, సతీస్, జంపయ్య, రవి, నరసింహారావు, మధుకర్‌రాజు, రామకృష్ణ, రమేష్, వెంకటరమణ, రామాంజలి తదితరులు పాల్గొన్నారు.


