రీ సర్వే సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రీ సర్వే సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యం

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

● అదనపు కలెక్టర్‌ అనిల్‌ కుమార్‌

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలో భూ రికార్డుల కచ్చితత్వాన్ని పెంపొందించడం కోసం రీ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించామని అదనపు కలెక్టర్‌ అనిల్‌ కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులకు జిల్లాస్థాయి రీ సర్వే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. రీ సర్వే నిర్వహణ విధానం, క్షేత్రస్థాయిలో భూముల పరిశీలన, భూముల సరిహద్దు గుర్తింపు, సర్వే వివరాల సేకరణ, సంబంధిత రెవెన్యూ రికార్డులతో వివరాల సరిపోలిక, ఆన్‌లైన్‌లో డేటా నమోదు అంశాలపై శిక్షణ అందించామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లు, రీ సర్వే బృందాల సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement