శనివారం శ్రీ 24 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 24 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

న్యూస్‌రీల్‌

వానాకాలంలో సాగుచేసిన వరిపంటలు పొట్ట దశకు చేరకున్నాయి. ఈ పరిస్థితిలో నీరు అందకపోవడంతో పంటలు ఎండుతున్నాయి. కొద్దిపాటి నీటితో ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశం లేదు. దీంతో దూర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటికి తీసుకొచ్చి మడిమడికి పారిస్తున్నారు. అదే విధంగా దూరంగా నీటి వనరులు ఉంటే పైపులైన్లు వేసి పొలాలకు మళ్లిస్తున్నారు. అ వసతి కూడా లేని ప్రాంతాల్లో.. ప్రధానంగా కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లో వర్షమే ఆధారంగా సాగుచేసిన పంటలను చేసేదేమీ లేక వదిలేస్తున్నారు.

బయ్యారం మండలంలో

నీరు లేక ఎండిపోతున్న వరి పొలాలు

ఆశలు

గల్లంతు!

సాక్షి, మహబూబాబాద్‌: వానాకాలం సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి.. పంటలు పండుతాయని ఆశతో వరి సాగుచేసిన రైతులు చివరి దశలో నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. తడిపారితే పంట పండుతుందని దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చి పొలం తడుపుతున్న వారు కొందరు అయితే.. నీటి వనరులు లేక.. చేసేది ఏమీ లేక పంటలు వదిలివేసి పశువులను మేపుతున్నవారు మరికొందరు ఉన్నారు.

పది మండలాల్లో లోటు వర్షపాతం

జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా.. ఇందులో పది మండలాల్లో వానాకాలంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. ఎనిమిది మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. ఇందులో గూడూరు, కొత్తగూడ, గంగారం, బయ్యారం, కురవి, మహబూబాబాద్‌, కేసముద్రం, దంతాలపల్లి, తొర్రూరు, సీరోలు మండలాల్లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ నమోదు అయ్యింది. దీంతో ఈ మండలాల్లో ఇప్పటికే కరువు ఛాయలు అలముకున్నాయి.

విద్యుత్‌ సమస్యతో ఇబ్బందులు..

వర్షాలు లేకపోవడంతో చెరువుల్లో నీరు లేదు. కాల్వల ద్వారా పారించే పంటలకు బోర్లు, బావులే దిక్కు అయ్యాయి. ఇందుకోసం విద్యుత్‌ మోటార్లపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే అందరూ ఒకేసారి విద్యుత్‌ మోటార్లు వేయడంలో లోఓల్టేజీ సమస్య తలెత్తుతోంది. సెప్టెంబర్‌ నెలకు జిల్లాలో విద్యుత్‌ సరఫరా కోటా 72.30 మిలియన్‌ యూనిట్లు ఉండగా.. వినియోగం మాత్రం 105.64 మిలియన్‌ యూనిట్లు అయ్యింది. అక్టోబర్‌ నెలలో ఇప్పటి వరకు 26.73 మిలియన్‌ యూనిట్ల కోటా ఉండగా.. కోటాకు రెట్టింపు అంటే 50.17 మిలియన్‌ యూనిట్లు వినియోగించారు. లోఓల్టేజీతో సెప్టెంబర్‌లో 307, అక్టోబర్‌లో ఇప్పటి వరకు 120 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. అదే విధంగా గడిచిన నెలరోజుల్లో జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా వ్యవసా య మోటార్లు కాలిపోయినట్లు అంచనా.

లోటు వర్షపాతంతో అడుగంటుతున్న భూగర్భ జలాలు

కరెంట్‌ కోతలతో మరింత ఇబ్బందులు

పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు

నీరు అందక పలుచోట్ల వదిలేస్తున్న రైతులు

పంటలు దక్కించుకునేందుకు పాట్లు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement