● అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
కురవి: సీరోలు మండలం కాంపల్లి–రేకులతండా జీపీల పరిధిలో విద్యుత్ లో ఓల్టేజీ సమస్యకు చెక్ పెట్టబోతున్నారు. శుక్రవారం సాక్షిలో ‘లో ఓల్టేజీతో ఎండుతున్న పంటలు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి విదితమే. ఈ మేరకు స్పందించిన సీరోలు ఏఈ జి.సునీల్‌కుమార్, కురవి సబ్ డివిజన్ ఏడీ అజ్మీరా రమేశ్ రైతులతో కలిసి లో ఓల్టేజీ సమస్యను అధిగమించేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. కాంపల్లి–రేకులతండా పరిధిలో కాంపల్లి ఓవర్‌లోడింగ్ సమస్యను పరిశీలించారు. లో ఓల్టేజీ సమస్యతో వరిపంటలు ఎండిపోవడం లేదని ఏడీ రమేశ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 100 కేవీఏ డీటీఆర్‌పై 23 వ్యవసాయ బావుల కనెక్షన్లకు విద్యుత్ సరఫరా అందిస్తోందని తెలిపారు. ప్రస్తుతం అదనంగా 63 కేవీఏ డీటీఆర్ అందుబాటులో ఉన్నప్పటికీ రైతుల్లో ఇరువర్గాల వాగ్వాదం వల్ల స్థలం సమస్య ఏర్పడిందని తెలిపారు. ఓవర్‌లోడింగ్ సమస్యను పరిష్కరించేందుకు వినియోగదారులు అదనంగా 63 కేవీఏ డీటీఆర్ ఏర్పాటు కోసం ప్రత్యామ్నాయ ప్రదేశంలో భూమి ఇచ్చేందుకు రైతులను ఒప్పించడం జరిగిందని తెలిపారు. ఆ స్థలంలో కొత్త డీటీఆర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉంటుందని ఆయన వివరించారు. కార్యక్రమంలో లైన్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీకాంతం, జూనియర్ లైన్‌మెన్ రోజిన్ కుమార్, రైతులు పాల్గొన్నారు.


