భద్రాచలంఅర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్ కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయంలో స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మురళీమోహన్ దంపతులను శాలువా, పట్టువస్త్రాలతో సన్మానించి, రామయ్య జ్ఞాపిక అందజేశారు. భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడాలి శ్రీనివాసన్, హైకోర్టు న్యాయవాది పీ.వీ.కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.


