సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

Oct 20 2026 4:31 AM | Updated on Oct 20 2026 4:31 AM

మహబూబాబాద్‌: సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఉమాకర్‌ డిమాండ్‌ చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఏడోరోజుకు చేరింది. కొంతమంది సిబ్బంది వారి పిల్లలతో సమ్మెలో పాల్గొని నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఉమాకర్‌ మాట్లాడుతూ.. ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలను రద్దు చేసి రాష్ట్ర హెల్త్‌ సొసైటీ ద్వారా వేతనాలు నేరుగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ ప్రయోజనాలు కల్పించాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. సమ్మెతో స్పందించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీకాంత్‌, మధు తదితరులు పాల్గొన్నారు.

ఇన్‌చార్జ్‌ డీఈఓగా సత్యనారాయణ

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారిగా కె.సత్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్‌ డీఈఓ సత్యనారాయణమూర్తి సెలవుల్లో వెళ్లడంతో హనుమకొండ జిల్లా విద్యాశాఖ కార్యాయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా (ఏడీ)గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, వారం క్రితం ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతికి జిల్లా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. ఆమె జిల్లాలో విధుల నిర్వహణకు సుముఖంగా లేనట్లు సమాచారం.

ఎస్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా మన్సూర్‌అలీ

మహబూబాబాద్‌ అర్బన్‌: స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌టీఎఫ్‌) జిల్లా అధ్యక్షుడిగా షేక్‌ మన్సూర్‌అలీని నియమిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా మన్సూర్‌అలీ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన నాయకులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామని, సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు.

పీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా యాకయ్య

తొర్రూరు రూరల్‌: పీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మండలంలోని హరిపిరాలకు చెందిన రాయిపల్లి యాకయ్య ఎన్నికయ్యారు. తాజాగా నల్లగొండలో నిర్వహించిన సంఘ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాల్లో ఆయనను ఎన్నుకున్నారు. గతంలో యాకయ్య ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వ్యవహరించారు. ఆయన ప్రస్తుతం మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.

అమ్మవారికి సర్వభూపాల సేవలు

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు సోమవారం అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించారు. ఆలయ అర్చకుడు భద్రకాళిశేషు ఆధ్వర్యంలో వేద పండితులు నిత్యాహ్నికం, చతుస్థానార్చనలు జరిపి చండీహోమం నిర్వహించారు. అమ్మవారి స్నపనమూర్తికి ఉదయం సిద్ధిధాత్రి క్రమంలో పూజలు జరిపి ఉత్సవమూర్తికి చతురన్త సేవ, సాయంత్రం శుంభహాక్రమంలో పూజలు జరిపి విమానకసేవ (సర్వభపాల వాహన) నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయి కుమార్‌ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement